మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇకపోతే  ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసి తెలిసిందే.ఇప్పుడు   తాజాగా ఈ సినిమాని ఎట్టకేలకు ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలావుండగా  తాజాగా ఈ సినిమా నుండి ఓ సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ఈ సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి ఓ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనించనుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే  ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని చూస్తున్న చిత్ర యూనిట్, ఇక ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు చిరంజీవి. ఈ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతుంది. ఈసినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా.. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మెగాస్టార్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: