మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నతాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాకి  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. తాజాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇకపోతే ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. 

హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీతో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అయితే సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట 'బుల్ బుల్ తరంగ్'ని ఏప్రిల్ 10న చిత్ర బృందం విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.ఇకపోతే  రవితేజ, రజిషా విజయన్ పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఇక ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుంది. కాగా ఫారిన్ డ్యాన్సర్ల తో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్ గా చిత్రీకరించారు.

 అయితే ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో రవితేజ, రజిషా జోడి బ్యూటిఫుల్ అండ్ స్టయిలీష్ గా వుంది. ఇకపోతే ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇక ఫుల్ ప్యాకడ్ యాక్షన్ తో నిండిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలని పెంచాయి. అయితే యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‏గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: