రాజకీయ రంగ ప్రవేశం తర్వాత పవన్ కళ్యాణ్ మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి చేసిన సినిమా "వకీల్ సాబ్".ఈ "వకీల్ సాబ్" సినిమా  ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమాను  హిందీ లో సూపర్ హిట్ అయినా  పింక్ సినిమాకి రీమేక్ సినిమాగా తెరకెక్కించటం జరిగింది. ఈ సినిమాని వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేశారు ,అలాగే దిల్ రాజు నిర్మించారు.

ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించగా  నివేద ,అంజలి, అనన్య , ప్రకాష్ రాజ్ మొదలయిన వారు ఇతర పాత్రల్లో తమ నటనను కనబరిచారు. ఇక 2021 ఏప్రిల్ 9న భారీ ఎత్తున విడుదలైన "వకీల్ సాబ్" సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇంకా  ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజం , అలాగే థమన్ మ్యూజిక్ , ప్రకాష్ రాజ్ - పవన్ కళ్యాణ్ ల మధ్య సాగిన కోర్ట్ సీన్ లో సూపర్ ఉమెన్ ను క్వేషన్ చేసే సన్నివేశాలు అయితే మాత్రం అభిమానులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది , అలాగే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోవటం ఇలాంటి మరెన్నో సన్నివేశాలు  ప్రేక్షకులను మరీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే "వకీల్ సాబ్" కేవలం వెండితెరపై మీద మాత్రమే కాదు బుల్లితెర ఫైన కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమా  "భీమ్లా నాయక్". "భీమ్లా నాయక్" సినిమా కూడా ప్రజలను ఎంతగానో మెప్పించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. మరి ఇప్పుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కనున్న "హరిహర వీరమల్లు" షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నాడు.ఇక వరుసగా రెండు హిట్లు అందుక్కున పవన్ కల్యాణ్ తన తరువాతి సినిమా "హరిహర వీరమల్లు" కూడా హిట్ అందుకోవాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: