హీరోయిన్ రాధిక ఆప్టే.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన రక్త చరిత్ర మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయినది. ఆ తర్వాత బాలకృష్ణ లయన్ చిత్రంలో కూడా నటించింది. అటు తరువాత తెలుగు సినిమాలలో కనిపించకుండా పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని సినిమాలలో.. వెబ్ సీరీస్ లలో చేస్తూ తన కెరీర్ ను ముందుకు సాగుతోంది.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో లైంగికంగా వేధించారని కూడా గతంలో చెప్పిన సంచలన వ్యాఖ్యలు తెరలేపింది. కేవలం గ్లామర్ రోల్స్ చేయడానికి మాత్రమే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. అయితే అందుకు తగ్గ కళలు కూడా ఉంటే ఎలాంటి సినిమా చేయడానికి అయినా నేను సిద్ధమే అని పలు సందర్భాలలో తెలిపింది. అయితే ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు చాలా దారుణమైన లుక్ లో కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోని కనుక మనం చూసినట్లయితే ఈమె జుట్టు ఫుల్ గా లేకుండా సగం కట్ చేసినట్లుగా కనిపిస్తోంది.


ఇక ఆమె గురించిన దుస్తులు కూడా చాలా దుమ్ము పట్టి ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇది కేవలం సినిమా షూటింగ్ లోనిదట.2016 లో వచ్చిన పర్ చెద్ సినిమాలోనిదట. రాధిక ఆప్టే గుజరాత్ గ్రామీణ యువతిగా ఈ చిత్రంలో కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఈమె తో పాటుగా నటుడు ఆది హుస్సేన్ తో కలిసి బోల్డ్ సీన్లలో నటించింది. అప్పట్లో ఈమె నటించిన ఈ చిత్రం పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ సినిమా సమయంలో ఈమె తీసుకొని ఈ ఫోటో ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ షేర్ చేయడంతో ఈ ఫోటో చూసిన నెటిజన్ చాలా ఆశ్చర్య పోతున్నారు. ప్రస్తుతం రాధిక ఆప్టే విక్రమ్ వేద వంటి చిత్రాలలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: