'ఆర్ ఆర్ ఆర్' సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించిన పాటల వీడియోలను మేకర్స్ ఒక్కటొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన 'నాటు నాటు' వీడియో సాంగ్ అయితే సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో సాగుతోంది. ఈ క్రమంలో లేటెస్టుగా "కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల" అనే మరో వీడియో పాటని చిత్ర బృందం రిలీజ్ చేసింది.'కొమ్మా ఉయ్యాల' సాంగ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాకు చాలా కీలకం.ఇక ఈ పాట పాడిన మల్లి అనే చిన్నారిని బ్రిటీష్ దొరసాని ఎత్తుకుపోవడంతోనే ఈ కథ అనేది మొదలవుతుంది. ఇప్పటి దాకా ఈ పాట ఆడియో కూడా విడుదల కాలేదు. దీని కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐదు భాషల్లో ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.'కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల.. అమ్మ ఒడిలో నేను రోజూ ఊగాలా.. రోజూ ఊగాలా' అంటూ సాగిన ఈ సాంగ్ ని చిన్నారి ప్రకృతి రెడ్డి ఎంతో అద్భుతంగా ఆలపించింది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ పాటకి సాహిత్యం అందించారు.ఈ పాటలో బ్రిటీష్ దొరసాని చేతికి డిజైన్ చేస్తూ మల్లి తన అందమైన గొంతుతో అందరినీ హత్తుకునేలా ఈ పాట పాడుతూ ఉంటుంది.



ఆ చిన్నారి ప్రతిభను మెచ్చిన ఆమె తిరిగి కోటకు వెళ్లేటప్పుడు మల్లిని అన్యాయంగా తీసుకెళ్లడం అనేది ఎంతో భావోద్వేగానికి గురి చేస్తుంది. మల్లికి తన తల్లితో ఉన్న అనుబంధాన్ని కూడా ఈ పాటలో మనం చూడొచ్చు.మల్లి ఢిల్లీ కోటలో బందీ అయిన క్షణాలు ఇంకా చివర్లో కొమురం భీమ్ గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ ఆమెను భుజాన ఎక్కించుకుని తిరిగి అడవికి తీసుకొచ్చే సీన్లను ఈ సాంగ్ లో చూపించారు. ఇప్పుడు 'కొమ్మా ఉయ్యాల..' పాట ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఇంకా యూ ట్యూబ్ లో బాగా వైరల్ అవుతూ సందడి చేస్తోంది.'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఇంకా కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ - ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియా - సముద్ర ఖని - రాహుల్ రామకృష్ణ - ఛత్రపతి శేఖర్ - మర్కండే దేశ్ పాండే తదితర నటులు కీలక పాత్రలు పోషించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: