టాలీవుడ్ గ్లామర్ బ్యూటి  కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈమెను అభిమానించని వారంటూ ఎవరూ ఉండరు. ఇకపోతే ఈమె తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అంతేకాకుండా ఈమె స్టార్ హీరోలతో మాత్రమే కాదు చిన్న హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా వరస అవకాశాలు అందుకుంటూ కుర్ర భామలకు పోటీ ఇస్తుంది. అయితే ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా మొన్నటి వరకు అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ వచ్చింది.ఇకపోతే  ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చేస్తుంది.

ఇకపోతే పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ స్పీడ్ పెంచింది.అయితే తాజాగా  ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మరేమీ సినిమాలు ఒప్పుకోవడం లేదు. అయితే ఒప్పుకున్నా రెండు మూడు సినిమాలు నుండి కూడా తప్పుకుంది.ఇదిలావుంటే కాజల్ తల్లి కాబోతున్న నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఇక ఈమె మాతృత్వం లోని మాధుర్యన్ని ఆస్వాదిస్తోంది. కాగా ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు ఏదొక ఫోటో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.ఇకపోతే కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ తెలిసింది.అయితే  ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.

ఇక కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు తాజాగా  తెలుస్తుంది. అంతేకాకుండా కాజల్ మెగా బిడ్డకు జన్మనిచ్చినట్టు వార్త బయటకు వచ్చింది.ఇకపోతే  ఈ విషయాన్నీ కాజల్ జంట అధికారికంగా ప్రకటించలేదు.అయితే కానీ ఆమె సోదరి నిషా అగర్వాల్ మాత్రం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వల్ల ఈ విషయం బయటకు వచ్చింది.ఇక  ''స్పెషల్ న్యూస్ ను మీ అందరితో పంచుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను'' అంటూ ఆమె పోస్ట్ చేసింది.అయితే దీంతో కాజల్ కు బిడ్డ పుట్టినట్టు బయటకు వచ్చింది. ఇదిలావుండగా ప్రెసెంట్ తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే తల్లిదండ్రులైనా కాజల్ అగర్వాల్ జంటకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెష్ చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: