పాన్ ఇండియా స్టార్ హీరో  ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సలార్'.ఇకపోతే ఈయన గత చిత్రం 'రాధేశ్యామ్' ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోవడంతో దాని ఎఫెక్ట్ 'సలార్' మీద పడుతుందని,ఇక  సినిమాకి హైపు తగ్గుతుందని, అభిమానులు ఆందోళన చెందారు.ఇదిలావుండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో తాజాగా  ఇప్పుడు 'సలార్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే  సింగరేణి బొగ్గుగనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.కాగా ఇక రవి బసుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాలో శృతి హాసన్ ఆధ్యా అనేక్యారెక్టర్ ని పోషిస్తోంది. ఇందులో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.. అయితే గతేడాది సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా దాదాపు నలభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాగా బ్యాలెన్స్ పార్ట్ ను కూడా త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే... 'సలార్' చిత్రానికి సంబంధించి.. గతేడాది షూటింగ్ జరుపుకున్న ఓ లొకేషన్ పిక్ లీకయింది. అయితే ఇందులో ప్రభాస్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు.ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే ఇందులోని ప్రభాస్ మేకోవర్, గెటప్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.అయితే  'రాధేశ్యామ్' లోని ప్రభాస్ కన్నా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో మళ్ళీ సెన్సేషనల్ హిట్ కొడతాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ మేకింగ్ కు, ప్రభాస్ కటౌట్ తోడయితే.. 'సలార్' చిత్రం 'కేజీఎఫ్' స్థాయిలో రికార్డులు బద్దలుకొడుతుందని టాలీవుడ్ లో టాక్ మొదలైంది. ఇకపోతే ఈ సినిమాను కూడా 'కేజీఎఫ్' మేకర్స్ హోంబలే పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే మరి 'సలార్' చిత్రంతో ప్రభాస్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: