ఇటీవల అనగా ఏప్రిల్‌ 13న రిలీజైన బీస్ట్ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర అంతగా రాణించలేకపోయింది.. అయితే ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఓక మోస్తరు కలెక్షన్లు కలెక్ట్ చేసినప్పటికీ ఎక్కువగా నెగెటివ్‌ రివ్యూలను అందుకుంది. అంతే కాదు ఈ సినిమాపై తాజాగా హీరో విజయ్‌ తండ్రి అయిన ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్పందించారు. ఈ సినిమా దర్శకుడు అయిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ మీద తన అసహనం వ్యక్త పరిచారు. ఈ బీస్ట్‌ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది కానీ సినిమా స్క్రీన్‌ప్లే లో అసలు మ్యాజిక్‌ లేదని చెప్పాడు.

ఓక టీవీ చానల్‌లో  ఈయన మాట్లాడుతూ.. 'అరబిక్‌ కుత్తు' పాటను డైహార్డ్‌ ఫ్యాన్స్‌ ఎంతగా అయితే ఎంజాయ్‌ చేయగలగారో నేనూ కూడా అలాగే ఎంజాయ్‌ చేశాను. కానీ ఈ సినిమా కేవలం హీరో విజయ్‌ స్టార్‌ డమ్‌ మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని నటించినట్లు ఉంది అన్నారు. అలాగే  అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు చెందిన సీరియస్‌ సబ్జెక్ట్‌ ను తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు గానే స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్‌ ను జోడించి ఉండాలి. కానీ ఈ సినిమాలో అలాంటిదెక్కడ కూడా అసలు కనిపించనే లేదు.

అలాగే దర్శకుడు ఇలాంటి మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది కూడా  ఒకసారి తెలుసుకుని చేసుంటే ఇంకా బాగుండేదని, ఇంకా రా ఏజెంట్స్‌ అసలు ఏం చేస్తారు ? అలాగే వారు ఎలా ప్రవర్తిస్తారు? అనేది కూడా దర్శకుడు లోతుగా తెలుసుకుని మరీ సినిమాను తెరకెక్కించాలని, ఈ సినిమా సక్సెస్‌పై తనకు  అనుమానించాల్సిన అవసరం తనకి ఏ మాత్రము లేదని చెప్పారు. ఇక సంగీత దర్శకుడు, ఫైట్‌ మాస్టర్‌, కొరియోగ్రాఫర్‌,  ఎడిటర్‌, అలాగే హీరో.. వీళ్ల వల్ల మాత్రమే బీస్ట్‌ సినిమా సక్సెస్‌ అయింది అని ఆయన తెలిపాడు. అంతే కానీ విజయానికి కారణం అయిన జాబితాలో దర్శకుడు నెల్సన్‌ పేరును అసలు ప్రస్తావించ లేదు. అలాగే ఇక సన్‌ పిక్చర్స్‌ వారు నిర్మించిన బీస్ట్‌ వసూళ్లలో  ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: