టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోలు గా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు.అయితే అలాంటి హీరోలలో ఒక్కరు మాస్ మహారాజా రవితేజ.ఇకపోతే రవితేజ కి మహాధన్ అనే ఒక్క కొడుకు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇక ఈయన రవితేజ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం రాజా ది గ్రేట్ అనే సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారక్టర్ ని చేసాడు.ఇదిలావుండగా రవితేజ కొడుకు హీరో గా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని సోషల్ మీడియా లో జరుగ ప్రచారాలు సాగుతున్నసంగతి మన అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం మహాధన్ వయస్సు 16 ఏళ్ళు..వాడి చదువు పూర్తి అవ్వగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు ...అని రవితేజ పలు సందర్భాలలో కొన్ని ఇంటర్వూస్ లో తెలిపాడు.

ఇదిలావుంటే ఇక  ఈ మధ్య గ్యాప్ లో టాలీవుడ్ కి చెందిన ఒక్క టాప్ డైరెక్టర్, కాలేజీ నేపథ్యం లో సాగే ఒక్క యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని రవితేజ కొడుకు మహాధన్ తో తియ్యడానికి రవితేజ ని కోరారు.ఇకపోతే రవితేజ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.అయితే ఆ డైరెక్టర్ మరెవరో కాదు రవితేజ తో రాజా ది గ్రేట్ అనే సూపర్ హిట్ సినిమా తీసిన అనిల్ రావిపూడి.ఇక ఈ సినిమా షూటింగ్ సమయం లో మహాధన్ కి సీన్ ని వివరించారు.అయితే  వెంటనే చురుగ్గా స్పందిస్తూ తక్కువ టేక్స్ లోనే సన్నివేశాలను పూర్తి చేసిన తీరు అనిల్ రావిపూడి కి ఎంతగానో నచ్చింది అని..అంతేకాకుండా అందుకే ఆయనతో ఒక్క సినిమా చేయలని నిర్ణయించుకున్నాడు.అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇకపోతే ఇక రవితేజ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..

 ప్రస్తుతం ఆయన టైగర్ నాగేశ్వర రావు మరియు రావణాసుర అనే సినిమాలు చేస్తున్నారు.అయితే క్రాక్ సినిమా తో ఇండస్ట్రీ లో రీసౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ కి, ఆ తర్వాత వచ్చిన ఖిలాడీ సినిమా ద్వారా పెద్ద ఫ్లాప్ ఎదురైంది.అయితే అందుకే ఇక నుండి ఆయన స్సీరువుట్ సెలెక్షన్స్ విషయం లో ఇక ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు .అయితే వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఒక్క సినిమాలో కూడా రవితేజ ఒక్క ముఖ్య పాత్రని పోషించబోతున్నట్టు తెలుస్తుంది.ఇకపోతే ఇందులో ఆయన చిరంజీవి కి తమ్ముడిలా కనిపించబోతున్నాడు.కాగా అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: