"పేరు గొప్ప ఊరు దిబ్బ" అన్నట్లు ఎంత గొప్ప పేరు ఉంటే ఏమి లాభం ఎన్ని మంచి పనులు చేస్తే ఏంటి. ఒక్క పొరపాటుతో అంతా తుడిచి పెట్టుకు పోతుంది అంటే అలాంటి పని ? ఆ పని వల్ల వచ్చే చిల్లర లాభం ? ఆసరమా అంటున్నారు. ఇంతకీ ఈ చర్చ మిల్క్ బాయ్ మహేష్ పైనేనా అంటే అవుననే వినిపిస్తోంది. సాయి పల్లవి లాంటి యంగ్ హీరోయిన్ లు సైతం సమాజానికి కీడు చేసే చెత్త యాడ్ లను చేయనంటూ లక్షల డబ్బును కాదు పొమ్మంటుంటే మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో అందులోనూ సీనియర్ హీరో ఇంకెలా ఉండాలి అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీ క్రేజ్ ఏమిటి ? మీ రేంజ్ ఏమిటి ?  వ్యక్తిగతం గానూ చిన్నారుల ప్రాణ దాతగా ఆర్దికంగా సహాయ సహకారాలను అందిస్తున్న ఒక గొప్ప వ్యక్తిగా ఎంత మంచి పేరుంది.

అలాంటి ఒక సెలబ్రిటీ చిల్లర డబ్బుల కోసం సమాజంలో మనుషులను పెడదారి పట్టించే మరియు వారి జీవితాలను నాశనం చేసే ఒక చెత్త ప్రకటన చేసి ఇపుడు అందరితో మీకు ఈ విమర్శలు అవసరమా సార్ అంటున్నారు. గుట్కా, పాన్ మసాలా వంటి ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ చేసిన అక్షయ్ కుమార్ ఇటీవలే క్షమాపణలు చెప్పి ఇకపై అటువంటి యాడ్స్ చేయనని బహిరంగంగా ఒప్పుకోగా మీరు మాత్రం మౌనంగా ఉన్నారేంటి బాస్ అంటున్నారు మహిని. సారి అక్కర్లేదు... కానీ కనీసం రియలైజ్ అయ్యి ఇకపై చేయనని అంటే బాగుంటుందేమో అంటూ సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

మౌత్‌ రిఫ్రెషనర్‌ పేరిట ఓ సంస్థ స్టార్ హీరోలను పెట్టుకుని వరుస పెట్టి క్రేజీ యాడ్స్‌ లను విడుదల చేస్తోంది. అందులో బాలీవుడ్‌ స్టార్స్ అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌, షారుఖ్‌ ఖాన్‌ లాంటి వాళ్లు కనిపించగా టాలీవుడ్ నుండి మహేష్‌ కనిపించారు. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు నెటిజన్లు. మరి ఆ స్పందన ఎప్పటికీ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: