15 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగడం అంటే సామాన్యమైన విషయమా ? హీరోలంటే కొనసాగుతారు కానీ హీరోయిన్లకు ఇలాంటి లాంగ్ సినీ జర్నికి పెద్దగా స్కోప్ ఉండదు, అందులోనూ హీరోయిన్ గా అంటే కంటెంట్ ఉంటే తప్ప అస్సలు కుదరని పని. అయితే అలాంటి అత్యున్నత స్థాయిని కైవసం చేసుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి. సూపర్ చిత్రంతో 2005 లో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ సుందరి ఇప్పటికీ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన జేజమ్మ ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి ఇపుడు మళ్ళీ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తోంది.

మొదట అందాల ఆరబోతతో అదుర్స్ అనిపించిన ఈ సుందరి ఆ తర్వాత అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. బిల్లా లాంటి చిత్రాలలో బికినీతో ఊరించాలన్నా... అరుంధతి వంటి చిత్రాలలో తెలుగు కట్టుతో శాసించాలి అన్నా తనకు తానే సాటి అన్నట్లుగా నటనకు ప్రాణం పోశారు అనుష్క.    
ఆ రోల్, ఈ రోల్ అని గిరి గీసుకుని కూర్చోకుండా వేదం సినిమాలో వేశ్య లాంటి పాత్రలను కూడా పోషించి వైవిధ్యభరిత నటిగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది స్వీటీ. ఇక ఈమె ఎఫైర్స్ విషయానికి వస్తే ... మొదటి నుండి వినిపిస్తున్న మాట ఒకటే... ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉందని, ఇందులో ఎంత నిజముందో అధైతే తెలియదు కానీ వీరిద్దరూ ఒకటయితే చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగ ఈమె స్క్రీన్ లైఫ్ గురించి అందరికీ బాగా తెలుసు అయితే ఈమె ఫ్యామిలీ కి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇపుడు మీకోసం. అనుష్క తల్లితండ్రులు విఠల్ శెట్టి, ప్రఫుళ్ళ శెట్టి. అనుష్కకు ఇద్దరు  అన్నయ్యలు కూడా ఉన్నారు. స్వీటీ పెద్దన్నయ్య గుణరంజన్ శెట్టి మరియు చిన్న అన్నయ్య రమేష్ శెట్టి. గునరంజన్ కు సలోని అనే అమ్మాయితో నాలుగేళ్ల క్రితమే వివాహం కాగా స్వీటీ చిన్న అన్నయ్య రమేష్ సెట్టి తన చెల్లెలు అనుష్క కు పెళ్లి కాకుండా తాను వివాహం చేసుకోనని భీష్మించుకు కూర్చున్నారట. స్వీట్ సిస్టర్ స్వీటీ పెళ్లి కోసం వెయిటింగ్ అనమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: