సాధారణంగా ఇటీవలి కాలంలో ఎంతోమంది సినిమా హీరోల వారసులు ఇండస్ట్రీకి హీరో గా ఎంట్రీ ఇచ్చి హవా నడిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ ఇండస్ట్రీలో చూసిన ఇలా వారసుల హవా ఎక్కువగా నడుస్తోంది. ఇలా సినీ ప్రముఖుల వారసులు హీరో హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ లుగా ఎదుగుతూ ఉన్నారు  ఇక మరికొంతమంది మాత్రం సినిమాలకు దూరంగా క్రీడల వైపు అడుగులు వేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా తమ తండ్రి ఐడెంటిఫై కాకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు.


 ఈ క్రమంలోనే తండ్రి బ్యాక్గ్రౌండ్ లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక తాను కూడా అలాంటి వాడిని అంటూ చెబుతూ ఉన్నాడో స్టార్ హీరో మాధవన్ కొడుకు. ఇటీవల కాలంలో ఇలా స్టార్ హీరోల కొడుకులు అందరూ కూడా తమ తండ్రి బ్యాక్ గ్రౌండ్ లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటే మాధవన్ కొడుకు మాత్రం క్రీడల వైపుగా అడుగులు వేసాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మాధవన్ కుమారుడిగానే ఉండిపోవాలని అనుకోవట్లేదు అంటూ  వేదాంత్ మాధవన్ చెప్పుకొచ్చాడు


 కాగా అటు క్రీడల్లో బాగా రాణిస్తున్నాడు అని చెప్పాలి. ఇటీవల డెన్మార్క్ ఓపెన్ 2022 స్విమ్మింగ్ పోటీలలో నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ గోల్డ్ మెడల్ సాధించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేదాంత్ మాధవన్ తన తండ్రి నీడలో వుండాలని అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం ఒక స్టార్ కొడుకుగా ఉండిపోవడం తనకు ఇష్టం లేదని.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నాను అంటూ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే  మాధవన్ అభిమానులందరూ ఆల్ ద బెస్ట్  చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: