నిహారిక కొణిదెల.. మెగా డాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మెగా ఫ్యామిలీ లోనే ముద్దుల కూతురు గా అల్లారుముద్దుగా పెరిగింది. ఇక మెగా డాటర్ అనే ముద్రను వేసుకోవడమే కాకుండా తనదైన శైలిలో తన కెరియర్ పరంగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి ఏకైక హీరోయిన్ గా నిహారిక పేరు సంపాదించుకుంది . ఇక మొదట్లో బుల్లితెర యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత ఒక మనసు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ పాత్రలలో  నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు అని చెప్పవచ్చు . అంతేకాదు కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా నిహారిక చేసింది.

కానీ ఏమాత్రం కూడా ఈమెకు నటన విభాగంలో గుర్తింపు లభించడం లేదని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే పలు వెబ్ సిరీస్ ల ద్వారా సందడి చేస్తూ నిర్మాతగా కూడా మారింది నిహారిక. ఇదిలా ఉండగా పోయిన సంవత్సరం జొన్నలగడ్డ వెంకట నాగ చైతన్య అనే వ్యక్తిని వివాహం కూడా చేసుకుంది. ఇక వివాహం తరువాత తన భర్తకు అలాగే కుటుంబ సభ్యులకు నిహారిక సినిమాలలో నటించడం ఇష్టం లేని కారణంగా ఆమె నటనకు దూరమైంది. ఇక సినిమాల పైన ఉన్న పిచ్చి కారణంగా తనకు దూరమైన నిర్మాతగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది.సినిమాల పరంగా బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే నిహారిక ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి చేసే అల్లరికి సంబంధించిన వీడియోలను అలాగే జిమ్ ట్రైనర్ తో  కలసి చేసిన ఒక వీడియోను కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.

ఇక ఈ వీడియో పై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు రావడంతో ఏకంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ విషయం మర్చిపోకముందే జూబ్లీ హిల్స్ పబ్ లో అడ్డంగా పోలీసులకు డ్రగ్స్ కేసులో దొరికిపోయింది. ఇక నిహారిక తన ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా ఆ పబ్ లో ఉండడమే ఆమె చేసిన తప్పు తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ మెగా కుటుంబం కూడా తనకు సపోర్ట్ గా నిలిచింది.. కానీ నిహారిక వ్యవహారంపై మెగా కుటుంబం తీవ్ర స్థాయిలో తప్పుపట్టి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. అందుకే ఇంకెన్నాళ్లు నిహారిక ను  హౌస్ అరెస్ట్ చేస్తారు అంటూ తమ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: