తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన హీరోగా సినిమాలు చేస్తే కోట్లాది మంది అభిమానులు ఆయన సినిమాలను చూడటానికి తరలి వస్తూ ఉంటారు అది బాలకృష్ణ ప్రత్యేకత.  ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలు చేయడంలో ఆయనను మించిన హీరో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో లేరు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అలా ఇప్పుడు మరొక మాస్ మసాలా యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

బాలకృష్ణ పోయిన ఏడాది డిసెంబర్ లో అఖండ సినిమాతో ప్రేక్షకులను అలరించగా ఈ హీరో ఇప్పుడు అదే స్థాయిలో మరోసారి అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అఖండ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరించిందో అందరికి తెలిసిందే. మంచి మంచి  గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలా బాలకృష్ణసినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా చేయడానికి రెడీ అవుతూ ఉండడం విశేషం. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు

కొంతమంది యువ దర్శకులు బాలకృష్ణ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇంత మంది దర్శకులు ఆయన వెంట పడుతున్న నేపథ్యంలో ఏ దర్శకుడితో ఆయన తన తదుపరి సినిమా చేస్తాడు అన్నది చూడాలి. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా సినిమా ఏ  స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో  అనేది చూడాలి. ఈ సినిమా లో హీరోయిన్ గా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేడు. త్వరలోనే దీనికి సంబందించిన ప్రకటన కూడా రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: