టాలీవుడ్ లో అసలు అపజయం ఎరుగని స్టార్ దర్శకుడు వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తాజా సినిమా ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29 వ తేదీ న ఆచార్య సినిమా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.దీనితో ఇక మూవీ యూనిట్ వారు ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇక శనివారం రోజున హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.అయితే ఆచార్య సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఆచార్య చిత్రంలో ఫ్యాన్స్ కి కాజల్ పాత్ర గురించి అనేక రకాల అనుమానాలు మొదలయ్యాయి. ట్రైలర్ లో ఒక్క షాట్ లో కూడా అసలు కాజల్ అగర్వాల్ అసలు కనిపించలేదు. దీనితో అసలు కాజల్ అగర్వాల్ ఆచార్య చిత్రంలో ఉందా లేదా అంటూ అభిమానులు ఇప్పుడు బాగా చర్చించుకోవడం మొదలు పెట్టారు.ఇక అంతేగాక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా అసలు కాజల్ అగర్వాల్ ప్రస్తావన అనేది కూడా అసలు ఎక్కడా లేదు. దీనితో ఎన్నో రకాల అనుమానాలు అనేవి చాలా ఎక్కువయ్యాయి.



అలాగే రీసెంట్ గా ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రపై పెద్ద బాంబు పేల్చారు. ఆచార్య సినిమాలో అసలు కాజల్ పాత్ర లేదని ఆయన షాక్ ఇచ్చారు.కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ని ఆ పాత్రకు ఫిట్ చేయడం సరైనది కాదు అని అనిపించింది. కాబట్టి ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే కాజల్ ని ఈ విషయంలో ఒప్పించడం జరిగింది. దీనితో కాజల్ అగర్వాల్ ఎలాంటి అసంతృప్తి లేకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని కొరటాల అన్నారు. కాజల్ ఆచార్య సినిమాలో లాహే లాహే సాంగ్ లో కూడా కనిపించిన సంగతి తెలిసిందే.ఇక అలాగే ఆచార్య సినిమాలో చిరంజీవి పాత్రకు హీరోయిన్ ఉండరనే కూడా క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కి కొంత మేర నిరాశ మాత్రం తప్పదు. సో మెగాస్టార్ కి ఈ చిత్రంలో రొమాన్స్ ఉండదు. కానీ యాక్షన్ ఇంకా డాన్సుల్లో మాత్రం చిరంజీవి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: