సినిమాలకు ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వం సహకారం ఉంటుంది..చిన్న సినిమా పెద్ద అని తేడా లేకుండా విడుదల అవుతున్న అన్నీ సినిమాలకు సర్కారు మంచి సపోర్ట్ ను ఇస్తుంది.అదనపు ఆటలను వేసుకోవడం, లేదా టికేట్ల రేట్లను పెంచుకొనె వెసులుబాటును కల్పిస్తున్నారు. ఆచార్య కు కూడా అలాంటి వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణా సర్కార్ ఒక జివొ ను పాస్ చేసింది.చిరంజీవి, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈనెల 29న విడుదల అవుతోంది.


ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకూ రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.50, సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో రూ.30 వరకూ టికెట్‌ ధరలు పెంచుకోవచ్చనని జివొ లో పెర్కొంది. గతంలో విడుదల అయిన ఆర్ఆర్ఆర్ కు ఎటువంటి అవకాశాలు ఇచ్చారో ఈ సినిమాకు కూడా అలాంటి అవకాశాలను కల్పిస్తుంది..మొత్తానికి ఇది మెగా ఫ్యాన్స్ కు అదిరిపొయె గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


ఇకపోతే ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన హిరోయిన్ గా కాజల్ నటించిన విషయం తెలిసిందే.అయితే ఆమె సీన్లను సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కాజల్‌ పాత్ర మరీ చిన్నదైపోయిందని, కథా గమనంలో అడ్డొస్తుందని, అందుకే ఆ పాత్రని తొలగించాల్సివచ్చిందని చెప్పుకొచ్చారు.. అయితే ఇప్పుడు ఆచార్య లో బొద్దుగుమ్మ అనుష్క నటించింది అనే వార్తలు జొరుగా వినిపిస్తున్నాయి.. ఆమె ఓ పాటలో తళుక్కున మెరిశారన్నది ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఆ విషయాన్ని చిత్రబృందం చాలా గోప్యంగా ఉంచిందట. థియేటర్ల లో అనుష్కని చూసి సర్‌ప్రైజ్‌ అవ్వాలన్న ఉద్దేశంతోనే అనుష్క ఎంట్రీపై సీక్రెట్ గా ఉంచారని సమాచారం.అసలు అనుష్క ఉందా లేదా అని తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందె..


మరింత సమాచారం తెలుసుకోండి: