సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లలో కొంతమంది నటించిన మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయవంతం కాకపోయినప్పటికీ క్రేజీ సినిమా అవకాశాలు మాత్రం దక్కుతూ ఉంటాయి.  అదే మరి కొంతమంది ముద్దుగుమ్మలకు  బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలు దక్కినప్పటికీ క్రేజీ సినిమా అవకాశాలు దక్కించుకోవడం లో మాత్రం వెనుకబడి పోతూ ఉంటారు.  అలా నటించిన సినిమాలలో దాదాపు అన్ని విజయాలు అందుకున్నప్పటికీ సినిమా అవకాశాలు దక్కించుకోవడం మాత్రం వెనుకబడి పోయిన టాలీవుడ్ ముద్దుగుమ్మ లలో ప్రియాంక జవాల్కర్ ఒకరు.

అనంతపురం అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ ముద్దుగుమ్మ నటించిన టాక్సీ వాలా , ఎస్ ఆర్ కళ్యాణమండపం,  తిమ్మరుసు మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి.  ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దుగుమ్మ నటించిన మూడు సినిమా లు మంచి విజయాలను సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ తన నటన తో,  అంద చందాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కోవడంతో ప్రియాంక జవాల్కర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

ఇలా నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు క్రేజీ మూవీ అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ప్రియాంక జవాల్కర్ సినిమాల్లో తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.  ప్రస్తుతం అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ , సుజన్ రావు దర్శకత్వం లో   `గమనం` అనే మూవీ లో నటిస్తుంది. మరి ఇప్పటి వరకు కెరియర్ పరంగా వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ ఎదుర్కొన్న  ప్రియాంక జవాల్కర్ 'గమనం'  సినిమా తర్వాత అయిన క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: