సినీ పరిశ్రమలో లవ్ లు బ్రేకప్ లు సర్వ సాధారణం. అందులోనూ బీ టౌన్ లో ఇలాంటివి చాలా ఎక్కువ. అయితే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ లవ్ స్టోరీస్ గురించి ఇపుడు లెక్క వద్దు కానీ తాజాగా తన వైవాహిక జీవితంలో అలియాకు వెల్కమ్ చెప్పారు. అయితే ఫ్యాన్స్ మిస్ అవుతున్న ఈ కొత్త పెళ్లి కూతురు అలా పెళ్లి చేసుకుని మళ్లీ ఇలా కెమెరా ముందుకు వచ్చేసింది. ఓ యాడ్ షూటింగ్ కోసం బయలుదేరిన నవ వధువు ఆలియాను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు... ఇంతకీ విషయం ఏంటయ్యా అంటే ? ఓ యాడ్ షూటింగ్ కోసం బయటకు వచ్చిన ఆలియా కెమెరా కళ్ళకు చిక్కింది. అయితే ఈమెని దీపికలా రెడీ అవ్వడం చూసి అంతా షాక్ అవుతున్నారు.

కార్లో వెళుతున్న ఆలియా బ్లు కలర్ లూజ్ టాప్ లో అచ్చం దీపిక లాంటి ఫ్లాట్ కొప్పు హైర్ స్టైల్ తో  కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఈమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఏమయ్యిందమ్మా ఆలియా తల్లి మొగుడ్ని కొంగుకు ముడేసుకోవాలి కానీ ఇలా తన మాజీ ప్రేయసి గుర్తొచ్చేలా  చేస్తావా ? ఏమయ్యింది నీకు అంటూ ఒకరు.. పెళ్ళై పోయింది ఇక ఎక్కడికి పోతాడు అనుకున్నావా ఏంటి అని మరికొందరు... దీపికా అక్కను సార్ ఇంకా మర్చిపోలేదా ఏంటి..?? ఆయన్ని కుషి చేయడం కోసమే ఇలా రెడీ అయ్యావా మేడం అని ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ ప్రేమ జంట ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్‌ 14న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య  వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: