హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అసలు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడ్వాంచర్, యాక్షన్ ఇంకా అలాగే ఫిక్షన్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉంటారు.హాలీవుడ్ సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి భారీ హిట్స్‌ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యి సంచలన విజయాలను సాధించిన సినిమాలల్లో ఖచ్చితంగా అవతార్(Avatar) సినిమా చెక్కు చెదరకుండా మొదటి స్థానంలోనే ఉంది. జేమ్స్ కేమరూన్( james Cameron) డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ వరల్డ్ సినిమా ఇది. ఇప్పటీకీ ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ లు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా అవతార్ పార్ట్ 2 క్రేజీ గ్లింప్స్ ని భారీ స్థాయిలో స్పెషల్ ప్రీమియర్‌గా వేశారు.ఈ గ్లింప్స్ ఐతే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.



 ఈ సినిమా ఎలా ఉండబోతుందని అన్నది ఈ గ్లింప్స్ ద్వారా పూర్తిగా అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా అండర్ వాటర్ లో ఉండనుందని మొదటినుంచి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అప్పుడెప్పుడో విడుదల చేసిన పోస్టర్స్ కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. తాజాగా జేమ్స్ కేమరూన్ ఇచ్చిన అప్డేట్ తో ఆ వార్తలు కూడా అని తెలుస్తుంది. ఈ మూవీకి "అవతార్ ది వే ఆఫ్ ది వాటర్" అనే టైటిల్ ని పెట్టినట్టుగా రివీల్ చేశారు. దాంతో ఈ టైటిల్ బాగా వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మే 6 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాను డిసెంబర్ 16 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ‘అవతార్ ది వే ఆఫ్ ది వాటర్’ మొదటి పార్ట్ కు మించి అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం అంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: