కణ్మణి ర్యాంబో కటీజా.. కె.ఆర్.కె గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్ సేతుపతి, సమంత, నయనతార. విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చింది. కాతువాక్కుల రెండు కాదల్ టైటిల్ తో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో కె.ఆర్.కె అంటూ సినిమాల్లో హీరో హీరోయిన్స్ పేర్లతోనే రిలీజ్ చేశారు.

ఈ సినిమాని తెలుగులో ఏదో మొక్కుబడిగా మాత్రమే రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఒక సినిమా ఒకేరోజున తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది అంటే ఎంతోకొంత ప్రమోషన్స్ చేయాలి. కానీ కె.ఆర్.కె సినిమాకు తెలుగులో ఏమాత్రం ప్రమోట్ చేయకుండా రిలీజ్ చేశారు. కనీసం ఈ సినిమాలో నటించిన సమంత కూడా తెలుగు వర్షన్ గురించి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అందుకే సినిమాపై తెలుగులో ఎలాంటి బజ్ లేదు.

ఈ క్రమంలో సినిమా గురించి చాలా తక్కువమంది ఆడియెన్స్ కి మాత్రమే తెలిసింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే పగలు ట్యాక్సీ డ్రైవర్ గా.. నైట్ పబ్ లో బడీ గార్డ్ గా చేసే ర్యాంబో అదేనండి విజయ్ సేతుపతికి అక్కడ కణ్మణి ఇక్కడ కటిజా ప్రేమలో పడతాడు. తన తల్లిని దూరం చేసుకున్న అతనికి ఒకేసారి ఇద్దరి ప్రేమ దొరుకుతుంది. ఇద్దరిని ప్రేమించిన ర్యాంబో ఇద్దరికి ఆ విషయం తెలిసి ఎలా డీల్ చేశాడు అన్నది సినిమా కథ.

సినిమాని డైరక్టర్ విఘ్నేష్ చాలా సరదాగా తెరకెక్కించారు. సినిమా అంతా సోసోగానే అనిపిస్తుంది. ఆల్రెడీ తెలిసిన కథనే కొత్తగా చెప్పాలని ప్రయత్నించాడు డైరక్టర్ విఘ్నేష్ శివన్. అయితే స్లో నరేషన్ వల్ల సినిమా ఆశించిన స్థాయిలో లేదు. మంచి స్టార్ కాస్ట్ తో రొటీన్ కథతో జస్ట్ ఓకే అనిపించింది కె.ఆర్.కె. తెలుగులో కొద్దిపాటి ప్రమోషన్స్ ఉన్నా సరే సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ఉండేవి. కానీ ఎందుకో కె.ఆర్.కె సినిమాని తెలుగులో లైట్ తీసుకున్నారు. విజయ్ సేతుపతి, ననయతార, సమంత నటన కోసం ఒకసారి సినిమా చూసేయొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: