ఏప్రిల్ 28, 2006 అప్పటివరకు ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ రికార్డులన్ని తిరగరాసి సూపర్ స్టార్ మహేష్ సరికొత్త సంచలనాలు సృష్టించాడు. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో మహేష్ చేసిన పోకిరి సినిమా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరిని ఆకట్టుకుంది. సినిమా రిలీజైన 30, 40 రోజుల దాకా సిటీల్లో టికెట్లు దొరకలేదంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటివరకు ముందు సినిమాలు సాధించిన రికార్డులను పోకిరి బ్రహ్మాండంగా బ్రేక్ చేసింది.

ఈ సినిమాతో గోవా భామ ఇలియానా కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందు అసలు ఇల్లి బేబ్ ని అనుకోలేదట. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ కోసం ట్రై చేశాడట పూరీ కానీ ఆమె వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటం వల్ల ఈ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇక మరో బాలీవుడ్ భామ దీపిక పదుకొనెని తీసుకోవాలని అనుకోగా అది కూడా కుదరలేదని తెలుస్తుంది. తెలుగు సినిమాలో నటించడానికి దీపిక అప్పట్లో ఇంట్రెస్ట్ చూపించలేదని టాక్.

ఆ తర్వాత అయేషా టకియాని కూడా అడిగారట. ఆమె కూడా ఛాన్స్ మిస్ చేసుకుంది. పోకిరి సినిమాలో పార్వతి మెల్టన్ కూడా హీరోయిన్ గా చేయాల్సిందని అన్నారు. ఫైనల్ గా అందరిని కాదని దేవదాస్ సినిమాతో మెప్పించిన గోవా భామ ఇలియానాని ఫిక్స్ చేశారు. ఇలియానా కాకుండా వేరే వాళ్లు చేస్తే ఎలా ఉంటుందో కానీ మహేష్ పక్కన ఇల్లి బేబ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. నేటికి 16 ఏళ్లు పూర్తి చేసుకున్న పోకిరి సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. పోకిరి తర్వాత మహేష్ తో బిజినెస్ మెన్ సినిమా తీసి అది కూడా సూపర్ హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్.


మరింత సమాచారం తెలుసుకోండి: