కొంత కాలం క్రితం వరకు భారతదేశంలో  'ఓ టి టి'  ప్లాట్  ఫామ్ ఫామ్ లను సినీ ప్రేక్షకులు పెద్దగా ఉపయోగించేవారు కాదు.  కానీ ఎప్పుడూ అయితే భారత దేశంలోకి కారోనా ఎంటర్ అయిందో అప్పటి నుండి సినీ ప్రేక్షకులు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోయారు.  దానికి ప్రధాన కారణం దేశంలోకి కారోనా ఎంటర్ అయిన తర్వాత ప్రభుత్వాలు థియేటర్ లపై  ఆంక్షలను విధించడం,  అలాగే మరి కొన్ని రోజులు పాటు పూర్తిగా థియేటర్ లను మూసివేయాలని తో సినీ ప్రేక్షకులకు 'ఓ టి టి' లే ప్రధాన దిక్కుగా మారాయి.  దానితో సినీ ప్రేక్షకులు  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోయారు.  అలాగే కొన్ని సినిమాలు నేరుగా థియేటర్ లలో కాకుండా  'ఓ టి టి'  లలో విడుదల కావడంతో ప్రేక్షకులు 'ఓ టి టి' లకు మరింతగా మొగ్గు చూపిస్తూ  రావడంతో  'ఓ టి టి'  సంస్థలు కూడా మంచి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  అందులో భాగంగా ప్రముఖ  'ఓ టి టి'   సంస్థ అమెజాన్ రాబోయే రెండు సంవత్సరాలలో దాదాపుగా 40 సినిమాలు/వెబ్ సిరీస్‌లను నిర్మించనున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న కొన్ని షోల వివరాలను అమెజాన్ ప్రైమ్ సంస్థ తెలియజేసింది.
 
అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో  అందుబాటు లోకి రానున్న వెబ్ సిరీస్‌లు:  దూత, ఫర్జీ,  సజల్, ది విలేజ్, హష్ హష్, మోడ్రన్ లవ్(హైదరాబాద్), బ్రెత్: ఇన్ టు ది షాడోస్, మేడ్ ఇన్ హెవెన్: సీజన్ 2, ది ఫ్యామిలీ మెన్, మిర్జాపూర్, పాతాళ్ లోక్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, ముంబై డైరీస్, పంచాయత్ ఎస్-2
అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి రానున్న సినిమాలు :  గోవింద నామ్ మేరా, జగ్ జగ్ జీయో, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, రన్ వే 34, థాంక్ గాడ్, భోలా, జయేష్ భాయ్ జోర్దార్, షంషేరా, పృథ్వీరాజ్, టైగర్-3, పఠాన్, టికు వెడ్స్ షేరు, ఫోన్ బూత్, జీ లే జరా ఇలా అమెజాన్ ప్రైమ్ వీడియో వరుస వెబ్ సిరీస్ లతో , సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: