కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటించిన సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్, మ్యాటినీ మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిన్మా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

థ :

పాదఘట్టం ప్రజలు ఏర్పరచుకున్న ధర్మస్థలిని బసవ (సోనూ సూద్) ఆక్రమించుకుని అక్కడ ఆరాచక పనులు చేస్తుంటాడు. అతని ఆగడాలని అడ్డుకట్ట వేయడానికి పాదఘట్టం ప్రజలు ఎవరు సాహసించరు. ఈ క్రమంలో పాదఘట్టం ప్రజలను కాపాడటానికి సిద్ధకు ఇచ్చిన మాట కోసం వస్తాడు ఆచార్య (చిరంజీవి). అసలు పాదఘట్టం ప్రజలకు ఆచార్యకు సంబంధం ఏంటి..? సిద్ధ ఎవరు..? ఆచార్య, సిద్ధ ఎలా కలుస్తారు..? అన్నది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ :

చిరంజీవి, చరణ్ లాంటి మెగా హీరోలతో కొరటాల శివ చేసిన ఆచార్య సినిమా పక్కా రొటీన్ కథతో వచ్చిందని చెప్పొచ్చు. కథ రొటీన్ గా ఉన్నా కథనం ఏమైనా ఆసక్తికరంగా సాగిందా అంటే అది కూడా పాత చింతకాయ పచ్చడి లానే ఉంది. సాధారణ ప్రేక్షకుడు కూడా అంచనా వేయగల సన్నివేశాలు రాసుకున్నాడు కొరటాల శివ.

మిర్చి నుండి భరత్ అనే నేను వరకు తను సినిమా తీస్తే హిట్ అనేలా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేసిన ఈ ఆచార్యతో షాక్ ఇచ్చాడు. ఇంతకుముందు తీసిన తన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇచ్చే కొరటాల శివ ఆచార్య పక్కా కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించాడు.

కథనం అయినా ఆసక్తికరంగా సాగిందా అంటే అది కూడా నిరసంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో అనిపిస్తుంది. చరణ్ ఉన్న ఎపిసోడ్స్ కొద్దిమేరకు బాగానే ఉన్నాయి. చిరు, చరణ్ లాంటి ఇద్దరు సూపర్ హీరోలతో కొరటాల శివ ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్ చేశాడని చెప్పొచ్చు.

మెగా ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు కూడా కొన్నే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి స్టైల్ ని కూడా సరిగా వాడుకున్నట్టు లేదు. సినిమాలో ఉన్నంతవరకు చరణ్ తన సత్త్తా చాటారు.

నటీనటుల ప్రతిభ :

ఆచార్యగా చిరంజీవి తన మార్క్ చూపించారు. అయితే చిరుని కొరటాల శివ ఇంకా వాడుకోవాల్సి ఉందనిపిస్తుంది. చరణ్ సిద్ధ పాత్రలో అదరగొట్టాడు. తన వరకు సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు చరణ్. పూజా హెగ్దే నీలాంభరిగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. బసవ పాత్రలో సోనూసూద్ ఎప్పటిలానే విలనిజం చూపించారు. అజయ్, నాజర్, మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

తిరు సినిమాటోగ్రఫీ పర్వాలేదు అన్నట్టు ఉంది. మణిశర్మ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. ధర్మస్థలి సెట్ భారీ స్థాయిలో నిర్మించినా దాన్ని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరక్టర్ కొరటాల శివ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.

ప్లస్ పాయింట్స్ :

చిరు, చరణ్

మణిశర్మ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

ఆచార్య.. మెగా హీరోలతో కొరటాల ప్రయత్నం విఫలం..!

రేటింగ్ : 2/5


మరింత సమాచారం తెలుసుకోండి: