భద్ర, బృందావనం, మున్నా, ఊసరవల్లి, సింహా లాంటి సినిమాలకు రైటర్ గా పనిచేసిన కొరటాల శివ మిర్చితో డైరక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో ఆ హిట్ మేనియా కొనసాగించాడు. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ఆచార్య అంటూ వచ్చాడు కొరటాల శివ.

ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరటాల శివ ఆచార్య సినిమా చూసిన ఆడియెన్స్ పేలవమైన కథతో 90వ దశకం నాటి కథనంతో వచ్చాడని కామెంట్ చేస్తున్నాడు. చిరు, చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి చేస్తున్న సినిమా లో కావాల్సిన కమర్షియల్ అంశాలని ఉంచకుండా కొరటాల శివ మిస్టేక్ చేశాడని అంటున్నారు. రైటర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగించిన కొరటాల శివ డైరక్టర్ గా నాలుగు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాడు. ఐదో సినిమా ఆచార్యతో ముందు నాలుగు సినిమాలతో తెచ్చుకున్న పేరు మొత్తం పోగొట్టుకున్నాడు.

ఆచార్య మెగా ఫ్యాన్స్ కి కూడా అసంతృప్తి కలిగించిందని చెప్పొచ్చు. ఇక డైరక్టర్ గా మిర్చి తీసిన టైం లోనే కేవలం 10 సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పారు కొరటాల శివ. అయితే ఆచార్య రిజల్ట్ చూసిన ఆడియెన్స్ 10 దాకా వద్దు ఐదు సినిమాలతోనే ఆపేయమని అంటున్నారు. హిట్ పడితే డైరక్టర్ ని ఎంతగా అభిమానిస్తారో తమ హీరోకి ఫ్లాప్ వస్తే అంతగా కామెంట్స్ చేస్తారన్న విషయం తెలిసిందే. అందుకే స్టార్ సినిమా అంటే ప్రతి సినిమా మొదటి సినిమాగానే ప్రయత్నించాల్సి ఉంటుంది. రిజల్ట్ ఎక్కడ తేడా కొట్టినా సరే అతని కెరియర్ లో ఎన్ని వరుస హిట్లు ఉన్నా వాళ్లని టార్గెట్ చేస్తారు ఆడియెన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: