మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఆచార్య. సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ముందు చరణ్ పాత్ర చాలా చిన్నదిగా రాసుకున్న డైరక్టర్ కొరటాల శివ చిరంజీవితో కథా చర్చలు చేయడంతో ఆ పాత్ర నిడివి పెంచాల్సి వచ్చింది. ఈరోజు రిలీజైన ఆచార్య సినిమా చూస్తే చరణ్ పాత్ర మాత్రమే కొద్దిమేరకు బాగా అనిపించగా చిరు పాత్ర చాలా రొటీన్ గా అనిపించింది.

ముందు రైటర్ గా ఆ తర్వాత డైరక్టర్ గా ఇప్పటివరకు ఓటమి ఎరుగని కొరటాల శివ ఆచార్య సినిమా ఇలా తీయడం వెనక మెగా ఫ్యామిలీనే కారణమని టాక్. డైరక్టర్ గా తను రాసుకున్న కథని కాకుండా కథని తమకి అనుగుణంగా మార్చి రాయమని చెప్పడం స్టార్ హీరోలకి అలవాటే. మెగా హీరోలకు అది మరీ కామన్ అన్న టాక్ ఉంది. ఆచార్య విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కథని పూర్తిగా మార్చేసినట్టు చెప్పుకుంటున్నారు.

అయితే హిట్ పడితే వారికే.. ఒకవేళ సినిమా దెబ్బ పడినా వారి మీదే ఎఫెక్ట్ పడుతుంది అని కొరటాల శివ కూడా సైలెంట్ గా వారు చెప్పినట్టే చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా కొరటాల శివ లాంటి సెన్సిబుల్ డైరక్టర్ మెగాస్టార్, మెగా పవర్ స్టార్ తో చేసిన ఆచార్య ఎన్నో భారీ రికార్డులను సృష్టిస్తుందని అనుకుంటే అది కాస్త తుస్సుమనిపించింది. తప్పు ఎవరిదైనా మెగా ఫ్యాన్స్ మాత్రం ఆచార్య విషయంలో అప్సెట్ అవుతున్నారు. ఇదే కాదు చిరు తను నెక్స్ట్ చేసే సినిమాల మీద కూడా ఆచార్య ఎఫెక్ట్ గట్టిగానే పడేలా ఉందని చెప్పొచ్చు. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఆచార్య చూస్తుంటే భారీ లాసులు మిగిల్చేలా ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: