అలనాటి కాలంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకున్న నటీమణులలో రాధిక ఒకరు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాధిక , మెగాస్టార్ చిరంజీవి తో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.  వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్నో  సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి.  ఇదిలా ఉంటే మరో సారి వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది.

కాకపోతే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి సరసన రాధిక హీరోయిన్ గా నటించడం కాదు... మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాకు రాధిక నిర్మాతగా వ్యవహరించబడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా రాధిక తెలియజేసింది.  తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే మూవీ లో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడని వివరించారు. తమ బ్యానర్ లో మూవీ కి ఓకే చెప్పినందుకు చిరంజీవి కి రాధిక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాధిక పేర్కొంది. ఇలా అలనాటి కాలంలో చిరంజీవి పక్కన ఆడిపాడిన రాధిక మరి కొద్ది రోజుల్లో చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించ బోతున్నట్లు తెలియజేసింది.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ ,  మూవీ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లతో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.  అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: