‘ఆచార్య’ ఘోర పరాజయం వెనుక కారణాలు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. మెగా అభిమానులు అయితే ‘ఆచార్య’ షాక్ నుండి ఇంకా తెరుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ ఘోర పరాజయానికి ‘ఆ’ అక్షరం సెంటిమెంట్ కారణం అయి ఉండవచ్చు అన్న కధనాలు వినిపిస్తున్నాయి.


చిరంజీవి ఇప్పటివరకు 152 సినిమాలలో నటించినప్పటికీ చిరంజీవి నటించిన సినిమాల టైటిల్స్ ‘ఆ’ అక్షరంతో మొదలైతే అవి ఘోర పరాజయాన్ని అందుకున్న సందర్భాలను మెగా అభిమానులు గుర్తుకు చేసుకుంటున్నారు. చిరంజీవి నటించిన 11వ సినిమా ‘అగ్ని సంస్కారం’ కవిత సుహాసిని హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ అప్పట్లో ఘోరమైన ఫ్లాప్. ఆతరువాత చిరంజీవి నటించిన ‘ఆరని మంటలు’ కూడా ఫ్లాప్ అయింది. ఆపై అతిధి పాత్రలో నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ కూడ ఫెయిల్ అయింది.


కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘ఆలయ శిఖరం’ భారతీరాజా తో కలిసి చేసిన ‘ఆరాధన’ కూడ ఫ్లాప్ అయ్యాయి. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన ‘ఆపద్భాంధవుడు’ కూడా నిరాశ పరిచింది. అదేవిధంగా భారీ బడ్జెట్ తో తీసిన ‘అంజి’ సినిమా కూడ ఫ్లాప్. అయితే ఈ సెంటిమెంట్ ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ ‘అభిలాష’ ‘అడవిదొంగ’ ‘అల్లుడా మాజాకా’ ‘అన్నయ్య’ సినిమా లపై ఈ ‘అ’ సెంటిమెంట్ పనిచేయలేదు.


దీనితో ‘ఆచార్య’ కూడ అలాంటి ‘ఆ’ సెంటిమెంట్ కు బలి అయింది అంటూ మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. సినిమాల విజయం పై సెంటిమెంట్స్ ప్రభావితం చూపిస్తాయి అన్న విషయం వాస్తవమే అయినప్పటికీ కథలో కొత్తదనం లేకపోతే ఎన్ని సెంటిమెంట్లను ఆధారంగా పెట్టుకుని టాప్ హీరోలతో సినిమాలు చేసినా అవి విజయవంతం కావు అని ‘ఆచార్య’ పరాజయం మరొకసారి రుజువు చేసింది. చిరంజీవి నుండి మరొక సూపర్ హిట్ వచ్చే వరకు మెగా అభిమానులు ఇంకా ‘ఆచార్య’ చేదు జ్ఞాపకాలలోనే కాలం గడుపుతూ ఉంటారు..


మరింత సమాచారం తెలుసుకోండి: