రాజకీయాలలో సినిమాలలో ఏదీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. ఎన్నికలలో గెలుస్తాడు అనుకున్న అభ్యర్థి ఒకొక్కసారి ఓటమి పాలవుతాడు. అదేవిధంగా భారీ అంచనాలతో విడుదలైన భారీ మూవీ ఫెయిల్ అవ్వడం ఎవరికీ అర్థంకాని విషయంగా మారుతుంది. చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో సగటు ప్రేక్షకుడుకి ఏమి నచ్చలేదు అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.


టాప్ హీరోల సినిమాలు సగటు ప్రేక్షకుడుకి పెద్దగా నచ్చకపోయినప్పటికీ కనీసం మొదటి మూడు రోజులు అయినా భారీ కలక్షన్స్ వస్తాయి. అయితే ‘ఆచార్య’ మూవీకి వీకెండ్ లో కూడ చెప్పుకోతగ్గ కలక్షన్స్ రాకపోవడం అదీ మెగా స్టార్ చిరంజీవి సినిమా అవ్వడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇక ఈ మూవీలోని సన్నివేశాల గురించి ఆలోచిస్తే వాస్తవానికి ఈ మూవీ క్లైమాక్స్ కొరటాల అనుకున్నది కాదనీ ఆ క్లైమాక్స్ ను కొన్ని రకాల ఒత్తిడిలు వల్ల మార్చి తీసారు అనే గుసగుసలు కూడ వస్తున్నాయి.



‘ఆచార్య’ క్లైమాక్స్ లో అఘోరాలు దేవి ఉప్పెన లాంటి సీన్స్ చూసిన వారికి ‘అఖండ’ సినిమా వెంటనే గుర్తుకు వస్తుంది. దీనితో ‘అఖండ’ క్లైమాక్స్ మళ్ళీ ‘ఆచార్య’ లో చూస్తున్నామా అన్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడుకి వచ్చిందట. అయితే ‘అఖండ’ మూవీ గత సంవత్సరం డిసెంబర్ లో విడుదల అయింది. ఈ మూవీ సక్సస్ అవ్వడంతో ఈ మూవీ క్లైమాక్స్ గురించి కొరటాలకు అదేవిధంగా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది.


మరి మళ్ళీ ‘అఖండ’ క్లైమాక్స్ లోని కొన్ని సీన్స్ ను ‘ఆచార్య’ లో ఎందుకు రిపీట్ చేసారు అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. ఈమూవీ ఎడిటింగ్ విషయంలో ప్రతి సీన్ లోను చిరంజీవి సలహాలు ఉన్నాయి అంటారు. ఆయన సలహాతోనే కాజల్ పాత్ర డిలీట్ చేసారు. ఇన్ని చేసిన చిరంజీవి ‘అఖండ’ క్లైమాక్స్ లోని సీన్స్ ను తన ‘ఆచార్య’ లో ఎందుకు ఉంచాడు అన్నది ఎవరికీ అర్థం కానీ విషయం..





మరింత సమాచారం తెలుసుకోండి: