హాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నో సూపర్హిట్ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పలు సూపర్ మాన్ సినిమాలు కూడా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాలీవుడ్లో కూడా పలు సూపర్ మాన్ చిత్రాలు వస్తున్న.. సూపర్ ఉమెన్ చిత్రాలు మాత్రం చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో హాలీవుడ్ లో సూపర్ గా ఉందని సినిమాలు బాగానే వస్తున్నాయి. ఇండియాలో కూడా కొన్ని సూపర్ రొమాన్స్ చిత్రాలు తెరకెక్కించారు కానీ అవి మెప్పించలేకపోయాయి.

అయితే ఇప్పుడు ఎట్టకేలకు కత్రినాకైఫ్ హీరోయిన్ గా ఒక సూపర్ ఉమెన్ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బాలీవుడ్ వర్గాలు. ఈ సంవత్సరం చివర్లో కత్రినాకైఫ్ హీరోయిన్ గా ఆలీ అబ్బాస్ డైరెక్షన్ లో ఒక భారీ యాక్షన్ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ఇందులో కత్రినా కైఫ్ ఎన్నో యాక్షన్ పాత్రలలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈమె సూపర్ ఉమెన్ పాత్రకు అందుకోసమే ఎంచుకున్నట్లు గా సమాచారం. సూపర్ రొమాన్స్ చిత్రాలు చాలా రిస్క్ తో కూడినవి.. కాబట్టి ఇలాంటి చిత్రాల్లో ఏ హీరోయిన్ నటించలేదు. కేవలం కత్రినా కైఫ్ అయితే నటిస్తుందని బాలీవుడ్ వర్గాల టాక్.

ఇక కత్రినా కైఫ్ కూడా ఇలాంటి సినిమాను చేసేందుకు ఒప్పుకున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి సూపర్ మాన్ పాత్రలో ఈమె ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఆమె అభిమానులు కూడా చాలా ఆసక్తి కరం గా ఉన్నారు. కత్రినా కైఫ్ తో ఈ సినిమా గత ఏడాది ప్రారంభించాల్సి ఉండగా.. ఆమె వివాహం కారణంగా పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.అయితే ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమాలో నటించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సూపర్ సోల్జర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: