ముంబై బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ స్పీడ్ లో ఉందని చెప్పవచ్చు. వరుసగా ఉప్పెన, బంగార్రాజు వంటి చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నది. ఈమె అందచందాలతో ప్రతి ఒక్క యువతను కూడా బాగా ఆకట్టుకుంటోంది. నటిగా తన కు ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధమని సవాల్ విసురుతోంది. మొదట తన తొలి చిత్రంతోనే మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఈ అమ్మడు. దీంతో టాలీవుడ్ మేకర్ సైతం ఆమె వైపు చూసేలా తిప్పుకుంది. తన మొదటి సినిమాతో సక్సెస్ కావడంతో లక్కీ గర్ల్ గా పేరు పొందింది.


ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాల షేర్ చేస్తే తమ అభిమానులను సంతోష పేడుతూ ఉంటుంది. ఇక గతంలో కూడా అరబికుత్ అనే సాంగ్ కి డ్యాన్స్ వేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ది వారియర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా అందులోనే బుల్లెట్ సాంగ్ పై కృతి శెట్టి గ్రూవింగ్ వీడియో చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ లో అమ్మడు నవ్వుతూ చాలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ తనదైన శైలిలో డాన్స్ తో బాగా ఆకట్టుకుంటోంది. జీన్స్ ప్యాంటు దుస్తులతో బాగా ఆకట్టుకుంటోంది.

కృతి అభిమానులు సైతం ఈ వీడియోకి తెగ లైకులు కొడతారు. ఇప్పటివరకు లక్షలకు పైగా లైక్ లు రావడం గమనార్హం. ఇక ఈ చిత్రంలో హీరో రామ్ సరసన కృతి నటిస్తున్నది. ఇక ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియో కూడా ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ పాటలో రామ్ కృతి శెట్టి బాగా ఆకట్టుకుంటున్నారు. దీంతో కృతి శెట్టి మరింత హైప్ తీసుకువచ్చే విధంగా ఈ పాటని పాపులర్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: