తెలుగు స్టార్ హీరోయిన్ సమంత కు ఒకప్పుడు హిట్ సినిమాలు ఎక్కువగా ఉండేవి.. ఆమె తో సినిమా చేయడం లక్ గా భావించే వాళ్ళు చిత్ర నిర్మాతలు, హీరోలు..పెళ్ళి అనంతరం హిట్ సినిమాల లో నటించి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ వస్తుంది.. కాగా, ఇటీవల విడాకులు తీసుకున్న సమంత ఐటెం సాంగ్ కూడా చేసింది.అల్లు అర్జున్, సుకుమార్ కాంబినెషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో ఊ అంటావా పాటలొ కనిపించి హిట్ టాక్ ను అందుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి 'కతువాకుల రెండు కాదల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తెలుగులో పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.


తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది సమంత. ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఎంటర్‌టైనర్ మూవీ 'శాకుంతలం'లో లీడ్ రోల్ చేస్తున్న సమంత, మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ 'యశోద'లో కూడా నటిస్తుంది.. ఈ చిత్రం నుంచి నిన్న గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ వీడియో చూస్తుంటే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో జనాలను బాగా ఆకట్టుకుంటోంది.


స్టార్ హీరోహీరోయిన్లు నటించే సినిమాలకు సంబంధించిన గ్లింప్స్ వీడియోల్లో ఏదో ఒక డైలాగ్ ఉండేలా చూసుకుంటారు. కానీ సమంత నటిస్తున్న యశోద చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, ఎలాంటి డైలాగ్ లేకపోవడంతో, ఈ సినిమా పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. సమంత సినిమాలో ఎలా కనిపిస్తుంది.అసలు స్టోరీ ఏమై ఉంటుంది.ఇలాంటి సందెహాలు వస్తున్నాయి.వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ లాంటి స్టార్స్ నటిస్తుండగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: