ఈసంవత్సరం విడుదలైన సినిమాలలో అత్యంత భయంకరమైన ఫ్లాప్ గా ‘ఆచార్య’ మారిపోయింది. 120 కోట్ల బిజినెస్ జరిగిన ఈమూవీ విడుదల తరువాత ఈ మూవీకి వచ్చిన భయంకరమైన నెగిటివ్ టాక్ తో బయ్యర్లకు సగం పెట్టుబడి కూడ రావడం కష్టం అని తేలిపోయింది. దీనితో ఈమూవీ బయ్యర్లను ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఒక పరిష్కారం చెపుతాడు అన్న ఊహాగానాలు వచ్చాయి.


అయితే చిరంజీవి తన భార్యతో కలిసి కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్ళడంతో మెగా స్టార్ ఇప్పట్లో అందుబాటులోకిరాడు. ఈసినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన తన సినిమాల షూటింగ్ ల హడావిడిలో బిజీగా ఉన్నాడు. దీనితో ‘ఆచార్య’ నిర్మించిన బయ్యర్ల కష్టాలు తీరడానికి కొంత సమయం పడుతుంది అని అనుకున్నారు అంతా. అయితే దర్శకుడు కొరటాల రంగంలోకి దిగి ‘ఆచార్య’ బయ్యర్లతో మాట్లాడటమే కాకుండా వారి నష్టాలను సాధ్యమైనంత స్థాయిలో సెటిల్ చేసే ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.


సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆసినిమాకు దర్శకత్వం చేసిన వ్యక్తి ఆర్ధిక విషయాలను పట్టించుకోడు. అయితే ‘ఆచార్య’ విషయంలో జరిగింది వేరు. ఈమూవీ మార్కెటింగ్ అంతా కొరటాల స్వయంగా తనకున్న పరిచయాలతో చేసాడు. ఈమూవీ ఫ్లాప్ అయినప్పటికీ అందరిలా తన బాధ్యత నుండి తప్పించుకోకుండా మూవీ విడుదలైన 10రోజుల లోపే ఈమూవీ బయ్యర్ల సమస్యలను తీర్చడానికి రంగంలోకి దిగడంతో కొరటాల పై ప్రశంసలు వస్తున్నాయి.


కొరటాల స్వతహాగా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. అందుకనే అతడి సినిమాలలో కూడ సామాజిక స్పృహ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అన్న పదాన్ని ఎరుగని కొరటాలకు ‘ఆచార్య’ పరాజయాన్ని పరిచయం చేసింది. ఒక విధంగా ఇది అతడికి ఊహించని షాక్. అయితే ఈ షాక్ నుండి వెంటనే తేరుకుని తన పరపతి పోకుండా ‘ఆచార్య’ బయ్యర్లను ఆడుకునే విషయంలో తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఇండస్ట్రీలోని అనేకమంది దర్శకులకు అతడు ఆదర్శంగా నిలిచాడు అంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: