లేటెస్ట్ గా విడుదలైన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ కు వచ్చిన అనూహ్య స్పందన చూసిన వారికి ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ వైపు అడుగులు వేస్తోందా అన్న సందేహాలు కల్గుతున్నాయి. ఇలాంటి అంచనాలు ఇండస్ట్రీ వర్గాలలో రావడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తున్నాయి.


మహేష్ నుండి సినిమా వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోవడంతో మహేష్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడ ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దీనికితోడు ఈమధ్య కాలంలో విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్’ సినిమాలలో హాస్యం లేకపోవడంతో ఇప్పుడు ఆలోటును ‘సర్కారు వారి పాట’ తీరుస్తుందని సగటు ప్రేక్షకుడు అంచనాలకు వస్తున్నాడు.


అదేవిధంగా ‘రాథే శ్యామ్’ ‘ఆచార్య’ లు ప్రేక్షకులను నిరాశ పరిస్తే ‘భీమ్లా నాయక్’ కు మంచిపేరు వచ్చింది కానీ ఆ మూవీలో కూడ ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీనికితోడు సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ తో సగటు ప్రేక్షకుడుకి అన్నివిధాల హాయిగా నవ్వుకుని సినిమా వచ్చి చాలారోజులైంది. ‘దూకుడు’ తరువాత మహేష్ కామెడీ చేసిన సినిమాలు పెద్దగా రాలేదు. దీనికితోడు ఈ సినిమా విడుదల సమయానికి పిల్లల పరీక్షలు కూడ అయిపోవడంతో క్లాస్ మాస్ ప్రేక్షకులు ‘సర్కారు వారి’ పాటకు క్యూ కడతారు అన్న చనాలు కూడ ఉన్నాయి.


దీనికితోడు మహేష్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ బాగా సెట్ అయింది అన్న లీకులు కూడ వస్తున్నాయి. బడా వ్యాపార వేత్తలు బ్యాంకుల నుండి తాము తీసుకున్న రుణాలు ఎగ్గొట్టడం సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితుల ఈ మూవీ కథకు సగటు ప్రేక్షకులు చాల సులువుగా కనెక్ట్ అవుతుందా అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఇది అంతా దర్శకుడు పరుశురామ్ ఈ సినిమా కథను నడిపించే టాలెంట్ పై ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు కడుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: