లేటెస్ట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న కీర్తి సురేష్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఇలాంటి పాత్రలో నటించి అద్భుతంగా రాణించిన కీర్తి పై ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సీరియస్ పాత్రను చేయడానికి ముందుకు వచ్చిన కీర్తికి మంచి గుర్తింపు వచ్చింది.



మరొక కథానాయికని ఊహించ కోలేనంత స్థాయిలో కీర్తి నటన ఉంది అంటున్నారు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకునే సన్నివేశంలో కీర్తి నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఓటీటీ లో ఈమె నటించిన ఏసినిమాకు రాని స్పందన  ‘చిన్ని’ సినిమాకు ఓటీటీ ప్రేక్షకుల నుండి వస్తోంది. జరుగుతున్న ఈ పరిణామాలు పరిశీలిస్తున్న మహేష్ అభిమానులు జోష్ లో ఉన్నారు. ఇప్పటివరకు కీర్తి సురేష్ ను ఐరన్ లెగ్ హీరోయిన్ గా భావిస్తున్న పరిస్థితులలో ఆమె దురదృష్టం మహేష్ ‘సర్కారు వారి పాట’ ను వెంటాడుతుందా అన్న భయంలో మహేష్ అభిమానులు ఉన్నారు.


ఇప్పుడు కీర్తికి ఆ ఐరన్ లెగ్ సెంటిమెంట్ పోవడంతో ఇక ‘సర్కారు వారి పాట’ కు ఎదురులేదు అన్న అంచనాలు మహేష్ అభిమానులకు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని ‘మైండ్ బ్లాంక్’ స్థాయిలో ‘సర్కారు వారి పాట’ మూవీలో ఒక పక్కా మాస్ సాంగ్ ఉంది అన్న ప్రచారం జరుగుతోది.


ఈమూవీలోని ఈ పాటలో మహేష్ కీర్తి సురేష్ లు మాస్ స్టెప్స్ వేసారని టాక్. నేడు జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఈ మూవీ మ్యానియా మరింత పెరుగుతుందని దీనితో ఈమూవీకి మహేష్ కెరియర్ లోనే చెప్పుకో తగ్గ స్థాయిలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు. ఇప్పుడు వరకు గ్లామర్ షోకు నో చెప్పిన కీర్తి గ్లామర్ విశ్వరూపం ‘సర్కారు వారి పాట’ లో చూడబోతున్నారు అన్న సంకేతాలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: