ఐ కాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే.  అల్లు అర్జున్ ,  సుకుమార్ కాంబినేషన్ లో ఇది వరకే ఆర్య ,ఆర్య 2 సినిమాలు రావడంతో పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పుష్ప సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్లుగానే పుష్ప సినిమా భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా 17 డిసెంబర్ 2021 వ తేదీన విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల నడుమ బాక్సాఫీస్ దగ్గర విడుదల ఆయన పుష్ప సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సాఫీసు దగ్గర నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.  పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న పుష్ప సినిమా  బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.  

పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని సాధించిన పుష్ప సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయ్యింది.  థియేటర్ లలో సూపర్ సక్సెస్ అయిన పుష్ప సినిమా బుల్లి తెరపై కూడా మొదటి సారి తన సత్తా చాటింది.  బుల్లితెరపై పుష్ప  సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 22.54 టి ఆర్ పి ని సాధించింది.  అయితే తాజాగా పుష్ప సినిమా రెండవ సారి బుల్లి తెరపై ప్రసారం అయ్యింది.  రెండవ సారి కూడా ఈ సినిమా మంచి టి ఆర్ పి ని సాధించింది.  రెండవ సారి పుష్ప  సినిమా 12.87 టి ఆర్ పి ని సాధించింది.  ఇలా ఇప్పటి వరకు రెండు సార్లు బుల్లి తెరపై ప్రసారం అయిన పుష్ప సినిమా రెండు సార్లు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: