‘ఆచార్య’ పరాజయం టాప్ హీరోల ఆలోచనలను పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తోంది. సినిమాలో ఎంత భారీతనం ఉన్నప్పటికీ అదేవిధంగా ఆమూవీని టాప్ డైరెక్టర్ చేసినప్పటికీ కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు ధియేటర్లకు రారు అన్న విషయాన్ని ‘ఆచార్య’ పరాజయం అందరికీ కనువిప్పు కలిగేలా చేసింది.


ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో తాను ఆశించిన స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ రానందుకు మధన పడుతున్న జూనియర్ తన భవిష్యత్ సినిమాల కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఒక స్థిర నిర్ణయంలో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ‘ఆచార్య’ తరువాత కొరటాల శివ మూవీ జూనియర్ తో ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది.


‘బృందావనం’ మూవీ కాలం నుండి జూనియర్ కు కొరటాలతో మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో ‘ఆచార్య’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కొరటాలతో మూవీ చేసే విషయంలో తారక్ మరో ఆలోచన లేనప్పటికీ ఇప్పటికే లాక్ చేసిన కథ విషయంలో ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఆలోచిద్దాం అని జూనియర్ కొరటాల కు చెప్పినట్లు టాక్. దీనితో ఈ నెలలో రాబోతున్న జూనియర్ పుట్టినరోజునాడు ఈ మూవీ ప్రారంభోత్సవం అనుకున్న విధంగా జరుగుతుందా లేదా అన్న విషయమై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారంమేరకు జూనియర్ కొరటాలను ‘కేజీ ఎఫ్ 2’ లాంటి ఒక భారీ యాక్షన్ సీన్స్ ఉన్న కథను వ్రాసుకు రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొరటాల కథలలో సామాజిక స్పృహ ఎక్కువ. జూనియర్ ను ఒక పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా చూపిస్తూ వ్యవస్థలో మార్పుల కోసం ఆరాట పడే రియల్ యంగ్ టైగర్ గా జూనియర్ ను చూపించాలని కొరటాల ఇప్పటికే ఒక కథ వ్రాసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ‘ఆచార్య’ ఫలితంతో తారక్ కొరటాల కథలో మార్పులు కోరడంతో ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: