బుల్లి తెర యాంకర్ సుమ పేరుకు పరిచయం అక్కర్లేదు.. పలు రకాల టీవీ షోలు చేస్తూ ప్రెక్షకుల ఆదరాభిమానాలను అందుకుంది.కేవలం షో లను మాత్రమే కాదు. సినిమాలకు సంభందించిన ఈవెంట్ లను కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఒకప్పుడు చేసి వదిలేసిన సినిమాలను ఇప్పుడు మళ్ళీ చెస్తుంది.జయమ్మ పంచాయతీ సినిమా లో మెయిన్ రోల్ చేసింది.చాలా రోజుల తర్వాత సుమ ప్రధాన పాత్రలో నటిస్తూన్నారు. దాంతో చాలా మంది ఆమె నటన వెండితెరపై ఎలా ఉంటుందో అని ఆసక్తి కనబరిచారు.మే 6న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాందించుకుంది.


అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో సుమ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చుని పక్కనే ఉన్న రాళ్లను పట్టుకుని నీటిని చూస్తుంది. అలా నిల్చున్నప్పుడు సడెన్ గా ఆమె కాలు జారి పడి పోయింది.ప్రమాదం నుంచి సుమ క్షేమంగా బయటపడడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సుమ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. తృటిలో ప్రమాదం తప్పింది అంటూ వీడియో కింద రాసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


సుమ ప్రధాన పాత్రలో డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించిన జయమ్మ పంచాయతీ సినిమా మే6న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో వెండితెరపై సందడి చేస్తోంది. భర్త ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడం, ఇంటి సమస్యల తో ఉన్న ఓ మహిళ ఎం చెస్తుంది..ఆ సమస్యల నుంచి ఎలా బయట పడుతుంది.అనే అంశం పై సినిమా కథ ఉంటుంది.అందుకు ఏకంగా గ్రామంపైనే పోరాటానికి సిద్ధమవుతుంది. ఇందులో బలమైన ఎమోషన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాష్ నిర్మించారు.. మొత్తానికి సుమ ఖాతాలో ఒక హిట్ పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: