గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన 'స్సైడర్ మ్యాన్: నో వే హోమ్' విషయంలో ఈ మైండ్ బ్లాక్ అయ్యే విషయం జరిగింది.హాలీవుడ్ సినిమాలకు అమెరికా తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే దేశం ఏది అంటే చైనానే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండే ఆ దేశంలో మంచి క్రేజున్న హాలీవుడ్ సినిమాలను విడుదల చేస్తే వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆమిర్ ఖాన్ సినిమా 'దంగల్' సినిమాయే అక్కడ రూ.1200 కోట్లు కొల్లగొట్టిందంటే 'స్పైడర్ మ్యాన్' ఫ్రాంఛైజీ సినిమాకి అక్కడుండే క్రేజ్ ఇంకా అలాగే వచ్చే వసూళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు.ఐతే ఈ సినిమాను గత సంవత్సరం చైనాలో రిలీజ్ చేయడానికి ముందు సెన్సార్ కోసం పంపగా..ఆ పతాక సన్నివేశంలో 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఘట్టం విషయంలో చైనా సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టినట్లు సమాచారం తెలిసింది.



కమ్యూనిస్టులు పాలించే చైనాలో పౌరులకు స్వేచ్ఛ అనేది ఉండదు. అలాంటి దేశంలో స్వేచ్ఛకు సూచిక అయిన 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' విగ్రహాన్ని  తెర మీద కనుక చూపిస్తే జనాల్లో వేరే భావనలు కలుగుతాయన్న ఉద్దేశంతో అది కనిపించే సీన్స్ అన్నిటిని తీసేయాలని సోనీ వారికి చైనా సెన్సార్ బోర్డు చెప్పిందట. చివరికి ఈ సీన్ లని ట్రిమ్ చేయాలని సూచించిందట. కానీ సోనీ పిక్చర్స్ అందుకు నిరాకరించడంతో 'స్పైడర్ మ్యాన్' సినిమా చైనా దేశంలో రిలీజ్ కానే లేదు. ప్రపంచవ్యాప్తంగా 'నో వే హోమ్' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా చైనా దేశంలో రూ.3 వేల కోట్ల దాకా ఆదాయం వచ్చేదట. కానీ చైనీస్ సెన్సార్ బోర్డు చెప్పినట్లు సదరు సీన్ తీసేయకపోవడం వల్ల రిలీజ్ ఆగిపోయి ఇంత ఆదాయాన్ని కోల్పోయిందట సోనీ కంపెనీ.

మరింత సమాచారం తెలుసుకోండి: