సన్నీ లియోన్‌ అడల్ట్‌ మూవీస్‌ నుంచి బాలీవుడ్‌కి వస్తోన్న సమయంలో చాలామంది మేకర్స్‌ సన్నీని తీసుకోవడానికి భయపడ్డారు. అయితే యూత్‌లో సన్నీకి వచ్చిన క్రేజ్‌ చూసి ఆ తర్వాత స్టార్‌ హీరోలు కూడా ఐటెమ్‌ సాంగ్స్‌ ఇచ్చారు. షారుక్‌ ఖాన్‌ 'రాయిస్‌'లో ఐటెమ్‌ సాంగ్ ఇస్తే, జాన్‌ అబ్రహం 'షూట్‌ అవుట్‌ ఎట్‌ వడాలా'లో సాంగ్‌ ఇచ్చాడు.

బాలీవుడ్‌లో కొద్దిరోజులుగా సన్నీ లియోన్‌కి అవకాశాలు రావడం లేదు. మొదట్లో చెక్కులు పట్టుకు తిరిగిన నిర్మాతలు కూడా సన్నీ మార్కెట్‌ పడిపోయిందని పలకరించడం మానేశారు. అయితే హిందీలో స్లో అయిపోగానే సౌత్‌కి వచ్చేసింది సన్నీ లియోన్. రోడ్లు బ్లాక్‌ చేసేంత ఫాలోయింగ్‌ ఉన్న మాలీవుడ్‌లో 'రంగీలా' చేస్తోంది. అలాగే తమిళ్‌లో 'వీరమాదేవి, షీరో, ఓ మై ఘోస్ట్' సినిమాల్లో నటిస్తోంది. సన్నీ లియోన్‌ తెలుగులో కూడా అవకాశాలు అందుకుంటోంది. మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు సినిమాలో ఒక కీ-రోల్ ప్లే చేస్తోంది. ఇంతకుముందు మంచు మనోజ్‌ 'కరెంట్‌తీగ' సినిమాలో ఒక స్పెషల్‌ రోల్‌ ప్లే చేసింది సన్నీ లియోన్. అలాగే రాజశేఖర్‌ 'గరుడవేగ'లో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. మళ్లీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రీ-ఎంట్రీ ఇచ్చింది.

సినిమాకి సరైన కథ ఉన్నా లేకపోయినా, బిజినెస్‌ స్ట్రాటజీస్‌ మాత్రం ఉండాలి. అప్పుడే ఆడియన్స్‌లో అంచనాలు మొదలవుతాయి. బిజినెస్‌ కూడా జరుగుతుంది. మంచు విష్ణు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడట. సన్నీ లియోన్‌ వీడియోస్‌తో గాలి నాగేశ్వర్రావుకి మైలేజ్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట విష్ణు. మంచు విష్ణు సరైన హిట్‌ కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతోంది. 'ఢీ' తర్వాత మళ్లీ ఆరేంజ్‌ హిట్ లేదు. మధ్యమధ్యలో 'దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం' లాంటి సినిమాలతో ఓకే అనిపించుకున్నా బాక్సాఫీస్‌ పోరులో మాత్రం నిలబడలేకపోతున్నాడు. ఇక 'లక్కున్నోడు, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్లు' డిజాస్టర్స్‌తో మంచు విష్ణు మార్కెట్‌ మొత్తం పడిపోయింది.

మంచు విష్ణు మళ్లీ బాక్సాఫీస్‌కి నమ్మకం కలిగించాలంటే భారీ హిట్‌ అందుకోవాలి. ఇలాంటి టైమ్‌లో 'గాలి నాగేశ్వర్రావు' సినిమా అనౌన్స్‌ చేశాడు. ఇక ఈ మూవీకి బోల్డంత గ్లామర్ యాడ్‌ చెయ్యడానికి బోల్డ్‌ గర్ల్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాడు. అలాగే ముంబయి నుంచి అడల్ట్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ని తీసుకొచ్చాడు మంచు విష్ణు. గాలి నాగేశ్వర్రావు షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి సన్నీ లియోన్‌తో కలిసి చేసిన సరదాలు, ప్రాంక్ గేమ్స్‌ ఇలా అన్నిటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నాడు మంచు విష్ణు. మరి హీరోయిన్‌ని వదిలేసి సన్నీతో వీడియోలు చేయడమేంటని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. దీనికి మరికొంతమంది మాత్రం సన్నీకి వరల్డ్‌వైడ్‌ గుర్తింపు ఉంది కాబట్టి, ఆమెని తీసుకొచ్చాడు. గాలి సినిమాకి క్రేజ్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: