టాప్ హీరోలు అంతా రంగంలోకి దిగి సుమ ‘జయమ్మ పంచాయితీ’ సినిమాను చూడండి అంటూ ఊదరగొట్టారు. యాంకర్ సుమ శక్తిమేర తన మూవీని చూడండి అంటూ ఎన్నో ప్రముఖ పత్రికలు ఛానల్స్ కు ఇంటర్యూలు ఇచ్చింది. ఇక యంగ్ హీరో శ్రీవిష్ణు ‘భళా తందనాన’ కు రాజమౌళి సపోర్ట్ లభించింది. ఈ మూవీని రాజమౌళి చాల గట్టిగా ప్రమోట్ చేసాడు.


అయితే ఈ రెండు సినిమాలు పరాజయాన్ని పొందాయి. ఈ రెండు సినిమాలతో పోలిస్తే విశ్వక్ సేన్ సినిమా ‘అశోకవనంలో అర్జున్ కళ్యాణం’ మూవీని చూడమని ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఏ సెలెబ్రెటీ ప్రమోట్ చేయలేదు. దీనికితోడు ఈ సినిమా విడుదలకు ముందు విశ్వక్ సేన్ ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ ను అవమానించాడు అంటూ మహిళా సంఘాలు దుమ్మెత్తిపోసాయి.


ఇంత నెగిటివ్ ట్రెండ్ కొనసాగినా విశ్వక్ సేన్ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. అయితే ఈ సినిమా చాల స్లోగా ఉండటంతో కేవలం అర్బన్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చే విధంగా ఈమూవీ మారింది. బిసి సెంటర్ల ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో విశ్వక్ సేన్ మూవీకి ఎంతవరకు కలక్షన్స్ వస్తాయి అన్న సందేహాలు కొంతమందిలో కల్గుతున్నాయి. క్రితం వారం విడుదలైన చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను రాజమౌళి తన భుజాల పై ఎత్తుకుని చరణ్ చిరంజీవి లను విపరీతంగా పొగుడ్తూ ఆకాశానికి ఎత్తేశాడు.


అయితే చిరంజీవి చరణ్ ల మ్యానియా ఆసినిమాను రక్షించలేకపోయింది. దీనితో ఒక సినిమా విడుదలై టాక్ వచ్చే వరకు టాప్ హీరోల నుండి చిన్న హీరోల వరకు విపరీతమైన టెన్షన్ పడుతున్న పరిస్థితి. దీనితో సినిమాకు విపరీతంగా ప్రమోషన్ చేసినా ఆసినిమాను సగటు ప్రేక్షకుడుకి నచ్చే అంశాలు లేకపోతే పట్టించుకోడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలను చేయాలా వద్దా అన్న సందేహాల మధ్య భారీ నిర్మాతల నుండి చిన్న నిర్మాతల వరకు టెన్షన్ పడుతున్నారు.. .


మరింత సమాచారం తెలుసుకోండి: