టాలీవుడ్ లో ఎపుడో సంచలన విజయ శంఖం పూరించాడు దర్శక ధీరుడు రాజమౌళి 1000 కోట్ల క్లబ్ లోకి బాహుబలిని దింపి భళా అనిపించారు, అప్పటి నుండి 1000 కోట్ల గ్రాస్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో సౌత్ నుండి వచ్చిన పాన్ ఇండియా చిత్రాలు బాహుబలి, బాహుబలి 2, పుష్ప, ట్రిపుల్ ఆర్, కన్నడ మూవీ కేజీఎఫ్, కేజీఎఫ్ చాప్టర్ 2, చిత్రాలు ఇటు సౌత్ లోనే కాదు అటు నార్త్ లోనూ కరోనా మిగిల్చిన నష్టాల దుమ్ము దులిపాయి. నార్త్ లో సొమ్మును కూడా మూటగట్టుకుని సౌత్ కు చేరవేశాయి. అయితే ఇటు మన సౌత్ పాన్ ఇండియా చిత్రాల హవానే కాకుండా మిగిలిన చిన్నా చితక సినిమాల సందడి కూడా భాగానే ప్రభావం చూపింది. చాలా వరకు చిత్రాలు సౌత్ లో విజయాన్ని సాధించి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే నార్త్ లో ఇపుడు పరిస్థితులు ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలయిన చిత్రాలు ఏవీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒకటి రెండు చిత్రాలు తప్ప అంచనాలను కనీసం దగ్గరగా కూడా రీచ్ అయిన హిందీ సినిమాలు తక్కువే.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ కాస్తో కూస్తో ఆర్ధిక భారం నుండి తేరుకుంది అంటే అది మన సౌత్ సినిమాల పుణ్యమనే చెప్పాలి. వారి నార్త్ చిత్రాలు నష్టాల్లో ముంచేస్తే మన సౌత్ చిత్రాలు అక్కడ బ్లాక్ బస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చి కొంచమైనా కష్టాల నుండి బయట పడ్డామని స్వయంగా వారే చెప్పిన సందర్భాలు చూసాం. అయితే ఇపుడు నార్త్ లో ఒక టాస్క్ నడుస్తోంది. ఇప్పట్లో నార్త్ లోనూ రిలీజ్ అయ్యే సౌత్ చిత్రాలు లేవు , అయితే బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకుని కాసుల వర్షం కురిపించి కష్టాలు రాకుండా వచ్చే చిత్రాలు ఏవి అన్నది పెద్ద ప్రశ్న అలాగే కీలకం కూడా, కాగా ఇపుడు ఈ భారమంతా ఖాన్ ల పైనే పడటం మరో విశేషం.   ఆగస్టు నెలలో అమీర్ సినిమా లాల్ సింగ్ చద్దా రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈ ఏడాది చివర్లో సల్మాన్ సినిమా టైగర్‌-3 సందడి చేయనుంది, ఇక బాలీవుడ్ బడా ఖాన్ షారుఖ్ మూవీ పఠాన్ రిలీజ్ కానున్నాయి. ఇవి వచ్చి మళ్లీ హిందీ ప్రేక్షకులను బాలీవుడ్ హీరోల వైపు మళ్లిస్తే తప్ప సౌత్ సినిమాల తాకిడి తట్టుకుని నార్త్ హీరోలు నిలబడటం ఆ స్థాయిలో నిలదొక్కుకోవడం  కష్టమని అక్కడి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అలా ఇపుడు భారమంతా బాలీవుడ్ ఖాన్ ల పైనే పడింది. మరి ఖాన్ లు తమ సత్తా చాటుతారో లేదో చూడాలి. 90వ దశకం నుంచి బాలీవుడ్‌లో ఖాన్‌లదే అక్కడ హవా నడిచింది,  దాదాపు పాతికేళ్ల పాటు షారుఖ్ ఖాన్‌, సల్మాన్ ఖాన్‌, ఆమిర్ ఖాన్ లు బాలీవుడ్ పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యం చలాయించారు. అయితే ఈ మధ్య వీరి జోరు కాస్త తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: