మాస్, యాక్షన్, ఫ్యాక్షన్, హిస్టారికల్‌ ఇలా ఎన్ని జానర్స్‌ ఉన్నా, బాక్సాఫీస్‌ దగ్గర పోలీస్‌ స్టోరీస్‌కి స్పెషల్‌ ఇమేజ్‌ ఉంటుంది. హీరోలు లాఠీ పడితే, అభిమానులకి ఫుల్‌ కిక్‌ వస్తుంది. ఈ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికే, యంగ్‌స్టర్స్‌ అంతా ఖాకీ తొడుగుతున్నారు. కొంతమంది తొలిసారి పోలీస్‌ స్టోరీస్ చేస్తోంటే, మరికొందరు  కాప్‌ స్టోరీస్‌తో హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఖాకీ చొక్కా వేసి 'గబ్బర్‌ సింగ్, భీమ్లానాయక్' సినిమాలతో సూపర్ హిట్స్‌ కొట్టాడు. రామ్ చరణ్‌ 'ఆర్ ఆర్ ఆర్'లో పోలీస్‌గా నటించి మెప్పించాడు. ఇప్పుడు వీళ్ల దారిలోనే టాలీవుడ్‌లో చాలామంది యంగ్‌స్టర్స్‌ పోలీస్‌ స్టోరీస్‌లోకి వెళ్తున్నారు. కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్‌ అని పవర్‌ఫుల్‌ డైలాగులు చెప్పడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్‌ 'బాహుబలి'తో జానపదాలకి వెళ్లాడు. 'బిల్లా, సాహో'తో మాఫియాని టచ్‌ చేశాడు. 'ఆదిపురుష్‌'తో మైథలాజీ సినిమా కూడా చేశాడు. కానీ ఇప్పటివరకు పోలీస్‌ క్యారెక్టర్‌ చేయలేదు. దీంతో ప్రభాస్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌ అంటూ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయడానికి పోలీస్‌ స్టోరీ రెడీ చేశాడు సందీప్‌ వంగా. 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్‌ని పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రజెంట్‌ చేయబోతున్నాడు సందీప్‌ వంగా.

రామ్‌ కెరీర్‌లో 'ది వారియర్‌' సినిమా కొంచెం స్ఫెషల్‌గా నిలవబోతోంది. ఈ మూవీతోనే రామ్‌ తొలిసారి   తమిళ మార్కెట్‌కి వెళ్తున్నాడు. తెలుగు, తమిళ్‌ బైలింగ్వల్‌గా రూపొందుతోన్న 'ది వారియర్'ని హిందీలోనూ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతోనే మొదటిసారి రామ్‌ ఖాకీ వేశాడు. పవర్‌ఫుల్‌ కాప్‌ స్టోరీస్‌గా రూపొందిన ఈ పోలీస్‌ స్టోరీ జులై 14న రిలీజ్‌ కాబోతోంది.
రెగ్యులర్ కమర్షియల్‌ మూవీస్‌కి దూరంగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు అడివి శేష్. 'మేజర్' సినిమాతో పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ని ఫోకస్‌ చేసిన అడివి శేష్, నెక్ట్స్ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించబోతున్నాడు. 'హిట్‌-2' సినిమాలో పోలీస్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో 'హిట్‌' సినిమాకి సీక్వెల్‌గా రాబోతోందీ సినిమా.

టాలీవుడ్‌లో అథ్లెట్‌ లుక్‌తో స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు సుధీర్‌ బాబు. లవ్‌, యాక్షన్, మాస్ స్టోరీస్‌తో పాటు ఈ హీరో ఖాకీ కథల్లోనూ నటించాడు. 'భోగ వసంతరాయలు, వి' సినిమాల్లో పోలీస్‌ క్యారెక్టర్స్ చేసిన సుధీర్‌ బాబు మూడోసారి ఖాకీ వేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్‌లో మహేశ్‌ దర్శకత్వంలో పోలీస్‌ స్టోరీ చేస్తున్నాడు సుధీర్. తండ్రి సాయి కుమార్ 'పోలీస్‌స్టోరీ'తో బ్లాక్‌బస్టర్ కొడితే, కొడుకు కూడా పోలీస్‌ కథలతో బాక్సాఫీస్‌ని మెప్పించడానికి సిద్ధమయ్యాడు. 'సిఎస్ఐ సనాతన్, అమరన్‌ ఇన్‌ ది సిటి, బ్లాక్' సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నాడు. ఇక శ్రీవిష్ణు కూడా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో కాప్‌గా మారాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: