మహేష్ 47వ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాడు. సాధారణంగా ఈ వయసుకు వచ్చేసరికీ ఎంత హీరోలు అయినప్పటికీ ఎక్కడో అక్కడ మొఖంలో మార్పులు వస్తాయి మొఖంలో గ్లో తగ్గుతుంది. అయితే మహేష్ మొఖంలో రోజురోజుకు గ్లో పెరిగిపోతోంది. అయితే మహేష్ హెల్త్ సీక్రెట్ ఏమిటి అంటూ చాలామంది మహేష్ ని డైరెక్ట్ గానే అడుగుతూ ఉంటారు.


ఒక చిన్న చిరునవ్వుతో ఆ అడిగిన ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇస్తాడు. ‘సర్కారు వారి పాట’ మూవీని ప్రమోట్ చేస్తూ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు పరుశురామ్ మహేష్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు. ఏ పూట ఎంత తినాలి అనే స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ మహేష్ ఫాలో అవుతాడట.


ప్రతి రోజూ మహేష్ తినే ఆహారంలో కెలరీలు మారవు. అయితే మహేష్ తినే ఆహారం మనం అస్సలు తినలేం అని పరుశురామ్ అంటున్నాడు. ఉప్పు కారం లేకుండా మహేష్ ఆహారపు అలవాట్లు ఉంటాయట. వారానికి ఒకసారి తనకు ఇష్టమైన ఆహారం తిన్నప్పటికీ మళ్లీ మరుసటి రోజు నుంచి డైటింగ్ ఖచ్చితంగా ఫాలో అవుతాడట.

అంతేకాదు జిమ్ చేసే విషయంలో కూడా నెలకోసారి మహేష్ ప్యాట్రన్ మారుస్తాడట. ఒకే తరహా వ్యాయామాలు చేయడట. తన లైఫ్ స్టయిల్ తో పాటు, సినిమాకు తగ్గట్టు జిమ్ చేయడం మహేష్ పద్ధతి. చివరికి తన హెయిర్ విషయంలో కూడా మహేష్ తీసుకునే శ్రద్ధ చాల ఎక్కువగా ఉంటుందని పరుశురామ్ చెపుతున్నాడు. అయితే మహేష్ బాబుకు గ్లామర్ వారసత్వంగా వచ్చిన జీన్స్ తో కూడ వచ్చి ఉండవచ్చు. మహేష్ తండ్రి కృష్ణ 80 సంవత్సరాల వయసులో కూడ అతడి మొఖంలో కాంతి తగ్గలేదు. ఈ వారసత్వమే మహేష్ కు వచ్చి ఉండవచ్చు. అందుకే ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తాను మహేష్ అందాన్ని చూసి తాను జలసీ పడతాను అంటూ జోక్ చేసాడు. ‘సర్కారు వారి పాట’ లో మరింత అందంగా కనపడుతున్న మహేష్ సీక్రెట్ ఇదే కాబోలు..



మరింత సమాచారం తెలుసుకోండి: