‘సర్కారు వారి పాట’ మ్యానియా తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడ విపరీతంగా కనిపిస్తోంది. ఈమూవీ టిక్కెట్లకు ఓవర్సీస్ లో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఏర్పడిన క్రేజ్ ను పరిశీలించిన వారికి కలక్షన్స్ పరంగా ఈమూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. మహేష్ కూడ రంగంలోకి దిగి క్షణం తీరిక లేకుండా ఈమూవీ గురించి ఛానల్స్ లోను ప్రింట్ మీడియాలోనూ విపరీతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నాడు.



మహేష్ తో ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తూ కీర్తి సురేష్ కన్నా మీరు సీనియర్ కాబట్టి ఆమెకు ఏమైనా సలహాలు ఇచ్చారా అన్నప్రశ్నకు మహేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. అతి తక్కువ సినిమాలలో నటించినప్పటికీ కీర్తి సురేష్ ‘మహానటి’ మూవీతో జాతీయస్థాయి ఉత్తమనటి అవార్డు గెలుచుకుందని అలాంటి మహానటి కి తానేమిసలహాలు ఇవ్వగలను అంటూ మహేష్ తనదైన స్టైల్ లో ఒక చిరునవ్వు నవ్వాడు.




ఇదే సందర్భంలో ఆ యాంకర్ మహేష్ ను ఒక ప్రశ్న అడిగి ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది. కీర్తి సురేష్ బెస్ట్ కో స్టార్ అంటూ మహేష్ తరుచు చెపుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా గతంలో కూడ మహేష్ చాలామంది హీరోయిన్స్ ను పొగిడిన సందర్భాన్ని గుర్తుకు చేస్తూ ఇలా ఇంతవరకు ఎంతమంది హీరోయిన్స్ ను పొగిడారు అంటూ మరొక ప్రశ్నతో మహేష్ ను మళ్ళీ ఇరికించడానికి ప్రయత్నించాడు.



దానికి మహేష్ సమాధానం ఇస్తూ "అలా చెప్పాలి కదండీ .. చేసేదే రెండేళ్లకి ఒక సినిమా అని మీరే అంటున్నారు. మరి అది కూడా చెప్పకపోతే ఎవరొచ్చి మనతో యాక్ట్ చేస్తారు చెప్పండి" అంటూ మరోసారి స్వీట్ గా నవ్వాడు. మహేష్ నవ్వు గురించి ఒకసారి చిరంజీవి మాట్లాడుతూ తనకు మహేష్ నవ్వులో అనేక అర్థాలు కనిపిస్తాయని ‘దొంగ’ అని ముద్దుగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: