దర్శకుడు పరుశురామ్ అల్లు కాంపౌండ్ సపోర్ట్ తో క్రేజీ దర్శకుడుగా మారాడు. పరుశురామ్ సమర్థత పై నమ్మకం ఉంచి అల్లు అరవింద్ అతడికి ‘గీత గోవిందం’ తీసే ఛాన్స్ ఇవ్వడంతో పరుశురామ్ ఒకేసారి క్రేజీ దర్శకుల లిస్టులోకి వెళ్ళిపోయాడు. ఆతరువాత పరుశురామ్ అల్లు అర్జున్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా తీయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. అయితే బన్నీకి పూర్తిగా పరుశురామ్ సమర్థత పై నమ్మకం కుదరకపోవడంతో పాటు సుకుమార్ తో ‘పుష్ప’ మూవీ చేయవలసి రావడంతో పరుశురామ్ చెప్పిన కథను వదులుకున్నాడట.


ఇప్పుడు ఆ కథ కొద్ది మార్పులు చేసుకుని మహేష్ తో ‘సర్కారు వారి పాట’ గా రాబోతోంది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. అయితే దర్శకుడు పరుశురామ్ ఈప్రచారాన్ని ఖండిస్తునాడు. గతంలో అల్లు అర్జున్ కు చెప్పిన కథా మహేష్ కు చెప్పిన కథ ఒకటి కాదనీ ఈకథ కేవలం మహేష్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసాను అంటున్నాడు. అంతేకాదు తాను మహేష్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఈవిషయాన్ని చాల క్లియర్ గా చెప్పానని అంటున్నాడు.


అయితే ఇండస్ట్రీలో కొందరు మాత్రం ‘సర్కారు వారి పాట’ కథ అల్లు అర్జున్ వద్దంటే మహేష్ కాంపౌండ్ కు చేరింది అంటూ ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది. ఒకరు హీరో వదులుకున్న కథ మరొక హీరో దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్స్ గా మారాయి.  


గతంలో పూరీ ‘ఈడియట్’ కథను పవన్ కళ్యాణ్ కు చెపితే అది అతడికి నచ్చకపోవడంతో రవితేజా నటించి అతడి కెరియర్ లో సూపర్ హిట్ అందుకున్నాడు. అదేవిధంగా పూరీ ‘పోకిరి’ కథను రవితేజా కు వినిపిస్తే అకథ మహేష్ కు నచ్చి నటించడంతో అతడి కెరియర్ లో బ్లాక్ బష్టర్ హిట్ గా మారింది. ఇప్పుడు అల్లు అర్జున్ జారవిడుచుకున్న కథ మహేష్ కు మరొక బ్లాక్ బష్టర్ హిట్ ఇస్తుందా అంటూ కొందరు అప్పుడే ఊహాగానాలు మొదలుపెట్టేసారు..




మరింత సమాచారం తెలుసుకోండి: