ఒకప్పుడు భారత సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ ... బాలీవుడ్ అంటే భారత సినీ పరిశ్రమ అన్నట్టుగా ఉండేది. అయితే ఇపుడు లెక్కలు మారాయండోయ్. మరి కాలం ఇంతగా మారుతున్న పాత చింతకాయ పచ్చడితోనే కానిచ్చేయండి అంటే ఎవరు మాత్రం అంగీకరిస్తారు. ఇక్కడ అదే పరిస్థితి తరాలు మారుతున్నా నాట్ నాట్ సెంచరీ కాన్సెప్ట్ లతోనే కంటిన్యూ చేస్తామంటే కుదరదుగా మారి బాలీవుడ్ సినీ పరిశ్రమలో కథల ఎంపిక అలానే ఉంది. ఎంత బ్లాక్ బస్టర్ అందుకున్నా చిత్రమైనా, మళ్ళీ మళ్ళీ అదే తరహాలో సినిమాలు తీస్తాం కొత్తదనం కొత్త ప్రయోగం మాకెందుకు అనుకుంటున్నారు చాలా మంది బాలీవుడ్ దర్శకులు. చాలా మంది హీరోలు సైతం సంథింగ్ స్పెషల్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. పాత హిట్ సినిమాల తరహాలోనే కానిచ్చేయండి అంటున్నారు.

అక్కడే కథ అడ్డం తిరిగింది, మాకు సినిమాలు లేకపోయినా పర్వాలేదు. కానీ మళ్ళీ మళ్ళీ అదే అర్బన్ డ్రామా కథల్ని చూడమని ఉండిపోతారు. దీంతో ఈ మధ్య కాలంలో రెండు మూడు హిందీ చిత్రాలు తప్ప ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అగ్గికి ఆజ్యం పోసినట్లు అక్కడ వారు తమ చిత్రాలను ఆదరించడం లేదు అనుకుంటుంటే దక్షిణాది చిత్రాలు అక్కడ డబ్ అయి ఘన విజయాలను అందుకుంటున్నాయి. భాష ఏదైనా కొత్తదనాన్ని ఎంజాయ్ చేస్తూ సౌత్ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు హిందీ ప్రేక్షకులు. అయితే ఇక్కడ తేడా ఏమిటి అంటే... దక్షిణాది చిత్రాల్లో ఇపుడు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటున్నాయి. కమర్షియల్ చిత్రాలకు ఇప్పుడు ఫ్యూచర్ ఎక్కువగా ఉంది.

ఈ రకమైన సినిమాలు తీసే దర్శక హీరోలు బాలీవుడ్ లో కరువయ్యారు.  కేవలం సల్మాన్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ లు మాత్రమే ఈ తరహా సినిమాలు చేస్తున్నారు.  యాక్షన్, మంచి డ్రామా, కామెడీ, సెంటిమెంట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దక్షిణాది చిత్రాలు తెరకెక్కుతుండటంతో హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇపుడు హిందీలో ఈ తరహా చిత్రాల సంఖ్య ఎక్కువయితే తప్ప అక్కడ మళ్ళీ బాలీవుడ్ సినిమాలకు మళ్ళీ డిమాండ్ పెరిగేలాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: