టాలీవుడ్ లో భాగంగా ఎన్నో సినిమాలు అంచనాలతో మన ముందుకు వస్తాయి. అయితే అన్ని సినిమాలు మనము అనుకున్న విధంగా మంచి విజయాలు సాధించి ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపును తెచ్చుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నో అంచనాలతో వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కలెక్షన్ లు అందుకోలేక చతికిలబడుతుంటాయి. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ లో సీక్వెల్స్ పరం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చినా సీక్వెల్స్ లో బాహుబలి , బాహుబలి 2 మరియు కెజిఎఫ్ కెజిఎఫ్ 2 లు మాత్రమే హిట్ అయినట్లుగా తెలుస్తోంది. కానీ చాలా వరకు సీక్వెల్స్ కలిసి రాలేదు.

అయితే టాలీవుడ్ లో సీక్వెల్స్ గా వచ్చి పరాజయం పాలైన అయిదు బెస్ట్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ - శంకర్ దాదా జిందాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఒక మాస్ హీరోగా మరియు దొంగదారిలో డాక్టర్ గా మారి తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరించాడు. దీనికి తోడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడవడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారింది. ఇందులో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా ఇచ్చిన విజయంతో దీనికి సీక్వెల్ ను ప్లాన్ చేశారు చిత్ర బృందం. అలా శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాను తెరకెక్కించారు. కానీ మ్యూజికల్ గా ఆకట్టుకున్నప్పటికీ కలెక్షన్ ల పరంగా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
 
2. గబ్బర్ సింగ్ – సర్దార్ గబ్బర్ సింగ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజే వేరు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తీసిన పోలీస్ డ్రామా గబ్బర్ సింగ్. ఈ సినిమా న్బచని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. అంతలా అందరినీ ఇది మెప్పించి కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. ఇది హిందీ మూవీ దబాంగ్ కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇచ్చిన విజయంతో సీక్వెల్ ను డైరెక్టర్ ను మార్చి సర్దార్ గబ్బర్ సింగ్ పేరిట తీశారు. అయితే అసలు ఈ సినిమా సీక్వెల్ ఇలా ఎందుకు ఉందొ అర్ధం కాకా ప్రేక్షకులు సతమతం అయ్యారు. కానీ పాతాళ పరంగా కొంచెం పర్వాలేదనిపించింది.

 3. ఆర్య - ఆర్య 2 : అల్లు అర్జున్ సుకుమార్ కాంబో ఇప్పటికీ చాలా ప్రత్యేకం... తన కెరీర్ లో మొదటి కమెర్షియల్ హిట్ ను అందించిన ఘనత సుకుమార్ కె దక్కుతుంది. వీరిద్దరూ కలిశారంటే బ్లాక్ బస్టర్ అన్న మాట. ఆర్య అనే మూవీతో ఒక మంచి  ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. మూవీ ఎంత పెద్ద హిట్ అయిందంటే... అల్లు అర్జున్ ను ఒక స్థాయిలో నిలబెట్టింది. అంతే నమ్మకంతో మళ్ళ్లీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ లు కలిసి ఆర్య 2 చేశారు. కానీ ఎక్కడో ఈ మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు. యావరేజ్ మూవీ గా నిలిచింది.

 4.  కిక్ - కిక్ 2 : రవితేజ కెరీర్ కొంచేము స్లో గా ఉన్న టైం లో సురేందర్ రెడ్డి తీసిన కిక్ సినిమా మాస్ మహారాజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ సినిమాలో థమన్ మ్యూజిక్, సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే రవితేజకు బ్లోయక్ బస్టర్ ను అందించాయి. ఈ నమ్మకంతోనే మళ్ళీ కిక్ 2 అంటూ మరోసారి రవితేజ వచ్చాడు. కానీ ఇది ప్లాప్ గా నిలిచింది.

5. పోలీస్ స్టోరీ - పోలీస్ స్టోరీ 2 : ఎప్పుడో ౩౦ సంవత్సరాల కిందట వచ్చినా పోలీస్ స్టోరీ మూవీ ఇప్పటికీ చూసేవారు లేకపోలేదు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీని తెలుగులోనూ డబ్ చేసి వదిలారు. సాయి కుమార్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రధానమైన పాత్రణలు పోషించారు. ఒక పోలీస్ ఎలా ఉండాలి అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా తీసుకోవాలి. కర్తవ్య నిర్వహణలో ఎన్ని ఆపదలు వచ్చినా లెక్కచేయని అధికారిగా సాయి కుమార్ జీవించారు. అదే నమ్మకంతో పోలీస్ స్టోరీ 2 పేరిట సీక్వెల్ ను తీశారు. అయితే ఇది కాస్తా ప్లాప్ గా మిగిలిపోయింది.

ఇలా టాలీవుడ్ లో ప్రీక్వెల్స్ హిట్ అయినా సీక్వెల్స్ విషయంలో మాత్రం దెబ్బేశాయి.

సాయికుమార్ హీరోగా వచ్చిన పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ పోలీస్ స్టోరీ.. అప్పట్లో ఇది సూపర్ దూపర్ హిట్ గా నిలిచింది. ఇదే విధంగా దానిని కొనసాగిస్తూ పోలీస్ స్టోరీ 2 ను తెరకెక్కించారు. ఈ సినిమా అదే టాక్ ను కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: