సినీ చరిత్రలో బాక్స్ ఆఫీస్ భరతం పట్టిన సినిమాలు అంటే ముందుగా గుర్తొచ్చేది మగధీర, బాహుబలి, కేజీఎఫ్ వంటి సినిమాలే. అయితే ఇప్పటి లెక్కలు వేరే అప్పటి లెక్కలు వేరే అనుకోండి అప్పట్లో కూడా సంచలన విజయాన్ని సృష్టించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే అప్పట్లో చిత్రాల్ని రాష్ట్రాల మధ్య ఉండగా... ఇపుడు పలు చిత్రాలు సినీ పరిశ్రమకే ముద్దు బిడ్డలుగా అలరిస్తూ భారత సినీ పరిశ్రమ కీర్తి ప్రతిష్టలను నలుమూలలకు చాటుతున్నాయి. ఈ తరహాలో మొదట లిస్ట్ లో చేరిన సినిమా బాహుబలి అనే చెప్పాలి. ఆ తరవాత పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు వరల్డ్ వైడ్ గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా చాటాయి. బాలీవుడ్ లాంటి బడా ఇండస్ట్రీ పై కూడా ప్రభావం చూపి కోట్ల రూపాయల కలెక్షన్లను ఖాతాలో వేసుకుని భళా అనిపించాయి.

బాహుబలి చిత్రంతో జక్కన్న ముందుగా 1000 కోట్ల బ్యాంక్ లో సౌత్ ఇండస్ట్రీలో నుండి  ఖాతాను ఓపెన్ చేసేసారు..ఇక అప్పటి నుండి వరుసగా దక్షిణాది చిత్రాలు భారీ విజయాలను అందుకుంటూ కమర్షియల్ గా కలెక్షన్ల పరంగా  దూకుడు పెంచాయి. ముఖ్యంగా మార్చ్ మరియు ఏప్రిల్ నెలల్లో విడుదల అయిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 3000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లు రాబట్టాయి అంటే దక్షిణాది చిత్రాలు ఏ స్థాయిలో రూపొందుతున్నాయి అన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఫిగర్ లో ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ రెండు సినిమాల వాటా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఈ రెండు చిత్రాల కలెక్షన్లు దాదాపు 2200 కోట్ల వరకు ఉన్నాయి. అంటే వీటి క్రెడిట్ ఏంటన్నది అర్దం అవుతోంది. ఇలాంటి చిత్రాలు మరెన్నో మన ముందుకు రావాలని సౌత్ ఇండియన్ చిత్రాల జోరు మరింత పెరగాలని ఆశిద్దాం. ఇక ప్రస్తుతం ఈ నెల 12 న మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలే ఉన్న నేపథ్యం లో కలెక్షన్లు కూడా అంతే భారీగా ఉండాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: