ఇటీవల కాలంలో పలువురు సినీ క్రీడా రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కించటం ట్రెండ్ గా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే.  కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం.. ఉన్న కథలోనే సినిమాటిక్ టచ్ ఇస్తే సరిపోతు ఉండడంతో ఇక దర్శక నిర్మాతలందరూ కూడా ఇలాంటి సినిమాలు తీసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు అటు ప్రేక్షకులు సైతం బయోపిక్ సినిమాలను చూసి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకూ ప్రతి ఒక్కరూ బయోపిక్ ల వెంట పరుగులు పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇదే ట్రెండ్ లో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన చిత్రం 83. 1983  కపిల్ దేవ్ కెప్టెన్సీలో మొదటిసారి టీమిండియా వరల్డ్ కప్ సాధించింది. అయితే పసికూన లాంటి టీమిండియా అటు వరల్డ్ కప్ లో అడుగుపెట్టి దిగ్గజ జట్లను సైతం ఓడిస్తూ ఎలాంటి ఫెసిలిటీలు లేని సమయంలో ఆటగాళ్లు అద్భుతంగా రాణించిన తీరు కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్  నటించాడు. కపిల్ దేవ్ భార్య పాత్రలో దీపికా పదుకొనే నటించింది.


 కాగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్గా మాత్రం హిట్ ఇవ్వలేక పోయింది అంటూ ఎన్నో విమర్శలు కూడా చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు 83 సినిమా హీరో రణవీర్ సింగ్. అంచనాలకు  తగ్గట్టుగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది అని కొందరు విమర్శిస్తున్నారు. కరోనా మూడవ దశ మధ్యలో రిలీజ్ అయ్యి దాదాపు 200 కోట్లు సంపాదించింది ఈ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు రణవీర్ సింగ్. 83 సినిమా ఫ్లాప్ కాదు అంటూ తెలిపాడు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయానికి పరిస్థితులు బాగా లేకపోవడంతో మా దురదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

83