రాజమౌళితో సినిమా చేశాక వెంటనే భారీ హిట్ కొట్టడం అసాధ్యమని ఇండస్ట్రీ మొత్తం కోడైకూస్తోంది.  'బాహుబలి' తర్వాత ప్రభాస్ అంచనాలు అందుకోలేక అభిమానులను అసంతృప్తి పరిచాడు. 'సాహో, రాధేశ్యామ్'కి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో జూ.ఎన్టీఆర్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాడు. 'ఆర్ ఆర్ ఆర్' ఇమేజ్‌ నుంచి బయటపడేందుకు కొరటాల శివ, బుచ్చిబాబు సానాతో పాటు అనిల్‌ రావిపూడిని లైన్‌లో పెట్టాడు.

కొరటాల శివకి టాలీవుడ్‌లో సెపరేట్ ఇమేజ్ ఉంది. కమర్షియల్‌ కమ్ మెసేజ్‌ ఓరియెంటెడ్ మూవీస్‌ చేస్తాడనే పేరుంది. ఇక తారక్‌ సినిమా కూడా ఇదే ప్లాట్‌లో రాబోతోందట. అలాగే 'ఉప్పెన'తో రొమాంటిక్ హిట్‌ కొట్టిన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు తారక్. ఈ మూవీ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. వీటితోపాటు ప్రశాంత్‌నీల్‌తో ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కూడా లైన్‌లో ఉంది.

జూ.ఎన్టీఆర్ నెక్ట్స్ అనిల్ రావిపూడితో ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ కాంబినేషన్‌ సెట్‌ అయింది అంటున్నారు సినీజనాలు. కామిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో హిట్స్‌ కొడుతోన్న అనిల్‌, తారక్‌తో ఇదే జానర్‌లో సినిమా చేస్తాడని చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ గురించి త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశముందట.

మరోవైపు జూ.ఎన్టీఆర్‌ ఇటీవల హిందీలో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంటరాక్షన్స్‌లోనే రాజకీయాల్లోకి ఎప్పుడెళ్తారనే ప్రశ్న వచ్చింది. దీనికి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఫ్యూచర్‌ గురించి చెప్పలేనని అన్నాడు తారక్. జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లనని కచ్చితంగా చెప్పలేదు. అలాగని వెళ్తానని సమాధానమివ్వలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. తారక్‌ భవిష్యత్ గురించి ఇప్పుడే చెప్పలేను అన్నాడంటే, పాలిటిక్స్‌లోకి వెళ్లే ఆలోచన ఉంది. అందుకే వెళ్లనని కన్ఫర్మ్‌గా చెప్పలేదు. త్వరలోనే ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి వస్తాడని పోస్టులు పెడుతున్నారు అభిమానులు.

జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ఒక సినిమాకి సైన్ చేశాడు. జూన్‌ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. వీటితోపాటు బుచ్చిబాబుతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్‌ అన్నీ పాన్‌ ఇండియన్ మూవీస్‌గానే రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన ఎన్టీఆర్.. ఇప్పుడు తన కెరీర్ విషయంలో జాగ్రత్తలు పడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: